ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ గుడ్ న్యూస్.. ఈ నెలలోనే నగదు జమ..?

2021 సంవత్సరం ప్రారంభమై 5 రోజులైంది. కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల గతేడాది దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాదైనా పరిస్థితులు మారతాయని సంతోషంతో, ఆరోగ్యంతో జీవనం సాగిస్తామని ప్రజలు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ నెలలో డియర్‌నెస్ అలవెన్స్ ను పొందే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో డియర్ నెస్ అలవెన్స్ పెరిగితే ఉద్యోగులు,వ్యాపారులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. 2020 సంవత్సరం మార్చి నెలలో వేతనం పెంపు నిర్ణయం అమలు జరిగింది. నివేదికలు ఏడవ వేతన కమిషన్ సిఫార్సులను బట్టి వేతన పెంపు ఉంటుందని తెలిపాయి.

2020 సంవత్సరం జనవరి నెల నుంచే వేతన పెంపు అమలవుతుందని ప్రకటన వెలువడినా కరోనా మహమ్మారి విజృంభణ వల్ల, డియర్‌నెస్ అలవెన్స్ పెంపు అమలులోకి రాలేదు. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు లేకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారు. డీఏ పెంపు అమలైతే 65 లక్షల మన్డి పెన్షనర్లు, 48 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.

ఉద్యోగులు, పెన్షనర్లు డియర్‌నెస్ అలవెన్స్ పెంపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏడవ వేతన సిఫార్సుల ను బట్టి డీఏ పెంపు అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో వేతన పెంపును ఎప్పటినుంచి అమలు చేస్తుందో చూడాల్సి ఉంది.