2021 సంవత్సరం ప్రారంభమై 5 రోజులైంది. కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల గతేడాది దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాదైనా పరిస్థితులు మారతాయని సంతోషంతో, ఆరోగ్యంతో జీవనం సాగిస్తామని ప్రజలు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ నెలలో డియర్‌నెస్ అలవెన్స్ ను పొందే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో డియర్ నెస్ అలవెన్స్ పెరిగితే ఉద్యోగులు,వ్యాపారులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. 2020 సంవత్సరం మార్చి నెలలో వేతనం పెంపు నిర్ణయం అమలు జరిగింది. నివేదికలు ఏడవ వేతన కమిషన్ సిఫార్సులను బట్టి వేతన పెంపు ఉంటుందని తెలిపాయి.
2020 సంవత్సరం జనవరి నెల నుంచే వేతన పెంపు అమలవుతుందని ప్రకటన వెలువడినా కరోనా మహమ్మారి విజృంభణ వల్ల, డియర్‌నెస్ అలవెన్స్ పెంపు అమలులోకి రాలేదు. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు లేకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారు. డీఏ పెంపు అమలైతే 65 లక్షల మన్డి పెన్షనర్లు, 48 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.
ఉద్యోగులు, పెన్షనర్లు డియర్‌నెస్ అలవెన్స్ పెంపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏడవ వేతన సిఫార్సుల ను బట్టి డీఏ పెంపు అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో వేతన పెంపును ఎప్పటినుంచి అమలు చేస్తుందో చూడాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…