Actor Ajay: అమ్మాయిని తీసుకువచ్చి రేప్ సీన్ చేయాలని చెప్పారు… షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు అజయ్!

Actor Ajay: తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో నటుడు విజయ్ ఒకరు. ఈయన హీరోగా చేసిన సినిమాల సంఖ్యా తక్కువే అయినప్పటికీ ఈయనకు విలన్ పాత్రలు ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. అదేవిధంగా పలు సినిమాలలో హీరో ఫ్రెండ్ పాత్రలలో నటించి సందడి చేశారు.

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు పొందిన అజయ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తాను చాలా హైట్ ఉండడం వల్ల హైట్ ఎక్కువగా ఉన్న హీరోలలో విలన్ పాత్రలలో నటించే అవకాశాలు రావాలని తన కోరుకుంటానని తెలిపారు.

ఇక విలన్ పాత్రలలో నటించడం వల్ల చాలామంది నన్ను బయట చూసి కూడా భయపడుతున్నారని అజయ్ తెలిపారు.ముఖ్యంగా విక్రమార్కుడు సినిమాలో తిట్ల పాత్రలో నటించిన తర్వాత తన పిల్లలు కూడా తన వద్దకు రావడానికి భయపడ్డారని వెల్లడించారు. ఇక సినిమాలలో తనకు రేప్ సీన్లలో నటించడం అంటే ఏమాత్రం ఇష్టం ఉండదని అజయ్ తెలిపారు.

Actor Ajay: అలాంటి సీన్లలో నటించడం ఇష్టం ఉండదు…


ఓ సినిమా షూటింగ్ సమయంలో ఒక అమ్మాయిని తీసుకువచ్చి తనకు సీన్ వివరించకుండా తనని రేప్ చేసే సీన్లలో నటించమని తెలిపారు. అయితే ఆ అమ్మాయి చేయి పట్టుకోగానే ఒక్కసారిగా అరిచేసిందని దాంతో తాను చాలా భయపడ్డానని అజయ్ తెలిపారు.ఇక సినిమా షూటింగ్లో అన్న తర్వాత ప్రమాదాలు జరగడం సర్వసాధారణం ఈ క్రమంలోనే ఓ సినిమా ఫైటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ఏకంగా క్రేన్ తన కాళ్లపై వెళ్ళిపోయింది.ఇలా ఈ ప్రమాదంలో తాను చనిపోయాను అనుకున్నాను కానీ తృటిలో తప్పించుకున్నానని ఈ సందర్భంగా అజయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.