బిరుదులు, అవార్డులంటే ఇష్టం లేదు.. వాటికి తాను అర్హుడిని కాదు: సీనీ నటుడు చంద్రమోహన్

కథానాయకుడిగా సీని పరిశ్రమలోకి వచ్చి ఆ తర్వాత సహాయ నటుడిగా, హాస్య నటుడిగా ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించిన నటుడు చంద్రమోహన్. 55ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించారు. కేవలం హీరో పాత్రలు మాత్రమే చేయాలని కాకుండా, అన్ని రకాల పాత్రలను పోషించాడు. ఈ క్రమంలో నిర్విరామంగా పనిచేస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు.

రాఖీ సినిమా షూటింగ్‌ అయిన వెంటనే బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. దువ్వాడ జగన్నాథమ్ సినిమా సమయంలో కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. అప్పుడు షూటింగ్‌ కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు సినిమాలు, క్రీడలు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. అతేకాకుండా వ్యాపారం అంటే కూడా ఇష్టమని.. ఆ మక్కువతోనే అతడు వ్యాపారంలో దిగగా.. అతడికి అచ్చి రాలేదని చెప్పుకొచ్చాడు.

తర్వాత సినిమాలపైనే ఎక్కువగా ఇష్టం కలిగిందని చెప్పడు. అంతేకాకుండా.. తనకు బిరుదులు, అవార్డులు అంటే అస్సలు ఇష్టం ఉండదన్నారు. పద్మ శ్రీ, పద్మభూషణ్ లాంటి వాటికి దూరంగా ఉంటానన్నారు. ఎందుకంటే.. తన కంటే గొప్ప గొప్ప నటులకు పద్మ అవార్డులు రాలేదు. వాళ్లకంటే తక్కువ స్థాయిలో ఉన్న నాకు ఈ అవార్డులు ఇస్తానంటే తాను ఓప్పుకోనని చెప్పుకొచ్చాడు. అతడి ఆరోగ్యంపై ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

అవన్నీ ఫేక్ అని.. తాను బాగానే ఉన్నట్లు చెప్పాడు చంద్రమోహన్. అంతేకాకుండా ఓ కమెడియన్ కు గిన్నీస్ బుక్ లో రికార్డు సొంతం చేసుకున్నాడు.. వెంటనే పద్మ అవార్డు అతడికి వరించింది..దీనిపై అతడు స్పందిస్తూ.. గిన్నీస్ బుక్ లో రికార్డు సొంతం చేసుకుంటే.. పద్మ శ్రీకి అర్హులు ఎలా అవుతారని చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రశ్నించారు.