Actress Rohini : ఆరోజు రఘువరన్.. పవన్ కళ్యాణ్ లో ఏదో మిరాకిల్ వుంది అంటే నమ్మలేదు. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. : రోహిని

డబ్బింగు ఆర్టిస్ట్ గా చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ లకు స్వర సహాయం చేసింది. “లేచి పోదామా” అని కవ్వించే గీతాంజలి నాయిక గొంతు, “చాయ్ పిలాతే” అనే “శివ” నాయిక గొంతు రోహిణిదే. నాలుగు స్తంభాలాట సినిమాకి సహాయ దర్శకులుగా పనిచేసిన పాణి షూటింగ్లో రోహిణిని గమనించి, గీతాంజలిలో గిరిజ డబ్బింగ్ కోసం ఆర్టిస్టును వెతుకుతుంటే రోహిణిని అడగమని సలహా ఇచ్చాడట. సినిమా ఆర్టిస్టుగా బదులు డబ్బింగ్ ఆర్టిస్టుగా ముద్రపడిపోతుందేమోనని భయంతో చేయకూడదని అనుకున్నది, మణిరత్నం సినిమాలో అవకాశం కాదనలేక ఈ సినిమాకు డబ్బింగు చేసింది.

గీతాంజలి తర్వాత “శివ”లో అమల పాత్రకు డబ్బింగ్ చేయమని రాంగోపాల్ వర్మ అడిగితే రోహిణి ఒప్పుకోలేదు. ఒక మూడు రీళ్ళు చూసి నచ్చితే చేయమన్నారు. అది చూసి నచ్చాక అమలకు కూడా డబ్బింగ్ చెప్పారు. ఆ సినిమా పెద్ద హిట్టై పోవడంతో ఇక అలాగే డబ్బింగు రంగంలో కొనసాగింది. ఒక్క విజయశాంతికి తప్ప దాదాపు తెలుగులో అందరు హీరోయిన్లకు డబ్బింగు చెప్పింది రోహిణి.

నవమోహిని లాంటి సినిమాలలో గ్లామర్ పాత్రలు పోషించినా, అంతగా విజయవంతము కాలేదు.రోహిణి సినీ నటుడు రఘువరన్‌ను 1996 లో వివాహం చేసుకుంది. ఈ జంటకు రిషి వరణ్ అనే కుమారుడు 2000లో జన్మించాడు. అయితే రోహిణి భర్త రఘువరన్ పవన్ కళ్యాణ్ తో తెలుగులో నటించారు. 1998లో “సుస్వాగతం” భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. ఇందులో పవన్ కల్యాణ్, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, రఘువరన్, సుధ తదితరులు నటించారు. అయితే ఈ సినిమా మొదటిరోజు షూటింగ్ అయిపోయిన తర్వాత.. రఘువరన్ ఇంటికి వెళ్లి ఏం చేశారన్నది రోహిణి మాటల్లో… రోహిణి ఓ చానల్లో మాట్లాడుతూ..

సుస్వాగతం షూటింగ్ మొదటి రోజున తనకు పవన్ కళ్యాణ్ కు మధ్య షూటింగ్ ఎలా జరిగిందని రఘువరన్ చెప్పారు. పవన్ కళ్యాణ్ లో ఏదో మ్యాజిక్.. తెలియని మిరాకిల్ ఉందని అన్నారు. అలాగే వారిద్దరూ కలిసి జానీ అనే సినిమాలో మరొకసారి కలిసి నటించారు. అలా వస్తాడు..ఇలా చేస్తాడు..వెళ్ళిపోతాడు. ఏంటి ఇలా అంటే.. మీకు అంతా తెలుసు అంటాడు. క్రేజీ బాయ్ అని పవన్ కళ్యాణ్ గురించి చెప్పాడు. అలా రఘువరన్ పవన్ కళ్యాణ్ మధ్య మంచి రిలేషన్ ఉండేది. అప్పుడు రఘువరన్ చెప్తుంటే ఏదో అనుకున్నాను. కానీ ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే రఘువరన్ చెప్పినా ఆనాటి విషయాలు గుర్తుకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి అభ్యుదయ భావాలు ఉన్నాయి.ఆయన అనుకుంటే చాలా చేయగలడు.ఒక రకంగా చెప్పాలంటే..ఆయనకు రాజకీయ శుభాకాంక్షలు తెలుపుతున్నానని…రోహిణి చెప్పారు.