పందెం కోసం ప్రాణాలను పణంగా పెట్టి సాహసం!

ఎంతోమంది యువకులు తమ సరదాల కోసం వారి నిండు ప్రాణాలను బలి తీసుకుంటారు. ఎంతోమంది యువకులు చిన్నచిన్న పందేలను కాస్తూ వారి ప్రాణాలతో చలగాటం ఆడుతుంటారు. ఇలాంటి తరుణంలోనే గత కొంత కాలం క్రితం హైదరాబాద్ నగర శివారులో కొంతమంది యువకులు ఎంతో ప్రమాదకరమైన బైక్ విన్యాసాలు చేస్తూ, స్థానికులలో కొంత అలజడి సృష్టించేవారు. తరువాత కొంతకాలం పాటు ఆపినప్పటికీ ప్రస్తుతం ఇలాంటి బైక్ విన్యాసాలను మరి మొదలుపెట్టారు.

అప్పుడు నగర శివారులో విన్యాసాలను చేసే యువకులు ప్రస్తుతం నగరం నడిబొడ్డున ప్రధాన కూడళ్లలో అర్థరాత్రి ఇలాంటి విన్యాసాలు చేస్తున్నారు.
మెహిదీపట్నం- టోలిచౌకీ మార్గంలోని రేతిబౌలి కూడలి వద్ద కొంతమంది యువకులు ఇలాంటి విన్యాసాలను చేస్తూ కనిపించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఉండే బైక్ రేసర్లు.. రెడ్ సిగ్నల్ పోయి ఆరెంజ్ సిగ్నల్స్ పడగానే అవతలివైపుకు వెళ్లాలి. తిరిగే గ్రీన్ సిగ్నల్స్ పడెలోపు ఇటు వైపుకు రావాలి. అయితే ఇదంతా కేవలం 5 సెకన్ల కాలంలో చేయాలన్నది పందెం.

ఈ ప్రమాదకరమైన పందెంలో గెలిచిన విజేతలకు బహుమతి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తారు. కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చే బహుమతి కోసం ఎంతో ప్రమాదకరమైన విన్యాసాలను చేయడంతో వారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడటం కాకుండా, ఇతరుల ప్రాణాలు కూడా ఎంతో ప్రమాదకరంగా మారవచ్చు. కేవలం1000 రూపాయల పందెం కోసం ఇంతటి ప్రమాదకరమైన విన్యాసాలలో పాల్గొనడం ఎంతో ప్రమాదకరమైనప్పటికీ కూడా కొందరు యువకులు నగరం నడిబొడ్డులో ఈ విధంగా బైక్ విన్యాసాలు చేయటంతో తోటి ప్రయాణికులు ఎంతో భయాందోళనలకు గురవుతున్నారు.