కరోనాను జయించేందుకు కొత్త పద్ధతి.. ఇంట్లోనే వైరస్ కు అలా చెక్?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఎంతో మంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో సరైన ఆక్సిజన్ వంటి మౌలిక సదుపాయాలు లభించగా చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అయితే ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి కొత్త పద్ధతిని కనిపెట్టానని చెబుతున్నారు బిహార్‌కు చెందిన ఒక డాక్టర్. 

పాట్నా ఆల్ ఇండియా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌)లో డిప్యూటీ మెడిక‌ల్ సూప‌రింటెండెంట్‌గా ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ అనిల్ కుమార్ కరోనాను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం డి- ల్యాంప్‌ అనే కొత్త పద్ధతిని కనుగొన్నట్లు తెలిపారు.ఈ పద్ధతిని పాటించడం ద్వారా ఎంతోమంది ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే కరోనాను చేయించవచ్చని డాక్టర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు.

కరోనా సోకిన వ్యక్తులు ఈ డి లాంప్ పద్ధతిని అవలంబించడం వల్ల ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే కరోనా నుంచి విముక్తి పొందవచ్చు.డి-ల్యాంప్ అనేది డి, ఎల్‌, ఏ, ఎమ్‌, పి అక్ష‌రాల‌తో సంక్షిప్త రూపంలో ఉన్న చికిత్స ప‌ద్ధ‌తి. ఇందులో మొదటి అక్షరం డి అంటే
డెక్సామెథ‌సోన్‌, ఎల్‌ అంటే లో మాలిక్యుల‌ర్ వెయిట్ హెప‌రిన్ ఇంజెక్ష‌న్ లేదా ఎపిక్సాబెన్ టాబ్లెట్‌. అంటే అజిత్రోమైసిన్ మాత్ర‌. ఎమ్ అంటే మాంటేలుకాస్ట్ అండ్ లివోసిట్రిజిన్ మాత్ర‌. ఇక చివ‌రిగా పి అంటే పారాసిట‌మ‌ల్ ట్యాబ్లెట్‌. ఈ విధంగా డి లాంప్ పద్ధతి ఉపయోగించడం వల్ల కరోనా నుంచి బయటపడవచ్చని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.

అదేవిధంగా కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఎమ్ 3 పిహెచ్‌ సి అనే పద్ధతిని పాటించాలని పాట్నా ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు.M3 అంటే.. మాస్క్‌, మ‌ల్టీవిట‌మిన్‌, మౌత్ గార్గిల్‌, అంద‌రూ మాస్క్ పెట్టుకోవాలి. పుక్కిలించడం ద్వారా నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోడానికి మ‌ల్టీ విట‌మిన్ ట్యాబ్లెట్‌లు వాడాలి. ఈ విధంగా ఎమ్ 3 పిహెచ్‌ సి అనే పద్ధతిని పాటించడంవల్ల కరోనా సోకకుండా జాగ్రత్త పడవచ్చని పాట్నా డాక్టర్లు తెలిపారు.