చిన్నారులు దేవుడితో సమానం అని చెబుతుంటారు. వారి మనసు ఎటువంటి కల్మషం లేకుండా ఎంతో మంచి భావంతో ఉంటుందని చెబుతారు. కానీ ఇతరుల పట్ల మానవత్వం, జాలి ,దయ మంచి పనులు చేయాలంటే వయసు అవసరం లేదు మంచి మనసుంటే చాలు అని చెబుతుంటారు. అచ్చం అలాంటి మంచి మనసే ఈ చిన్నారికి ఉందని నిరూపించుకుంది.
తాజాగా ఓ చిన్నారి తన కుక్క వర్షంలో తడవకుండా, దానికి గొడుగు పట్టి తాను వర్షంలో మద్దయి పోయింది. తనకంటే ఎక్కువగా కుక్కకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఈమె మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ కుక్క పట్ల ఆ చిన్నారి చూపిన ప్రేమకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిన్నారికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి శుశాంత్ నంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో వర్షంలో ఓ పాప గొడుగు పట్టుకొని వెళుతుండగా తన ముందుకు వెళుతోంది. అయితే అది తడవకుండా ఆ చిన్నారి కుక్కకు గొడుగు పట్టింది. చిన్నారి గొడుగు పట్టడంతో ఆ కుక్క అటూ ఇటూ కదులుతూ ఉన్నప్పటికీ చిన్నారి వదలకుండా ఆ కుక్కను వర్షంలో తడవకుండా గొడుగు పట్టింది.
ఈ వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్ షేర్ చేస్తూ… ‘ఇతరుల కోసం చిన్న చిన్న పనులు చేయడమే దయ. అది మనం చేయగలిగిందే’ అనేక ఆప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారిన ఎంతో మంది నెటిజన్లు ఆకట్టుకోవడంతో ఆ చిన్నారిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…