Renu Desai: రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి అకీరా కామెంట్స్… ఇలా ఉన్నారేంట్రా బాబు?

Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఈమె హీరోయిన్గా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం అనంతరం మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది. ఇలా పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్నటువంటి ఈమె తన పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఇప్పటికీ ఒంటరిగానే గడుపుతున్నారు.

ఇకపోతే రేణు దేశాయ్ గతంలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నటువంటి ప్రతిసారి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమెను బెదిరింపులకు కూడా గురి చేస్తున్నారు. నాకు విడాకులు ఇచ్చి పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుంటే తప్పులేదు కానీ నేను చేసుకుంటే తప్పేంటి అంటూ ఈమె పలు సందర్భాలలో అభిమానులకు ఎదురు కూడా తిరిగారు.

ఇకపోతే ఈమె సాధారణ మహిళ మాత్రమే కాదు ఒక హీరోయిన్ ఒక స్టార్ హీరోకి భార్య కావడంతో ఈ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ బరువు బాధ్యతలను తీసుకునే వ్యక్తి వస్తే పెళ్లి చేసుకోవాలని ఈమె అనుకున్నారు కానీ అలాంటి వ్యక్తి కనిపించకపోవడంతో పెళ్లిని ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు.

పెళ్లి చేసుకుంటే తప్పా…
ఇకపోతే ఇటీవల పెళ్లి గురించి ఈమె మాట్లాడుతూ తన పిల్లలు చాలా ఉన్నతంగా ఆలోచిస్తారని తెలిపారు. ఒకానొక సందర్భంలో అకిరా నాతో మాట్లాడుతూ మా అమ్మ నాన్న మరో పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఇంకో పెళ్లి చేసుకోలేదు అంటూ నన్ను ప్రశ్నించారని, నువ్వు చేసుకుంటే తప్పేంటి అంటూ అకీరా మాట్లాడారంటూ తన రెండో పెళ్లి గురించి రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న దగ్గర విడాకుల గురించి మాట్లాడారని రేణు తెలిపారు.