విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రధాని.. ఎర్రకోట నుంచి కీలక ప్రకటన..!

దేశంలో అన్ని సైనిక్ పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం ఉంటుందని 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ వెల్లడించారు. ఎర్రకోటపై నుంచి ప్రధాని మాట్లాడుతూ.. తనకు లేఖలు సైతం రాస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్లలో బాలికలకు ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించినట్లు ప్రధాని వెల్లడించారు.

ప్రస్తుతం దేశ‌వ్యాప్తంగా 33 సైనిక్ స్కూళ్లు ఉన్నాయి. రెండున్నరేళ్ల కింద‌ట తొలిసారి మిజోరంలోని సైనిక్ స్కూల్‌లో బాలిక‌ల‌ను అనుమ‌తించిన‌ట్లు మోదీ వెల్లడించారు. భారతదేశ సమగ్రాభివృద్ధికి ప్రతిఒక్కరూ సంకల్పంతో ఉండాలని పేర్కొన్నారు. సైనిక్ స్కూల్స్ సొసైటీ ఈ పాఠశాలలను రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలో నిర్వహణ జరుగుతోంది.

విద్యార్థుల‌ను చిన్నతనం నుంచే భారత సాయుధ బాలగాల వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేశంకోసం పోరాడి త్యాగాలు చేసిన మహనీయుల కీర్తిని కొనియాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ కరోనా సమయంలో కరోనా వారియర్లు ప్రజా సేవ చేస్తున్నారని మెచ్చుకున్నారు.

ఈ కరోనా సమయంలో భారత్ స్వయంగా కరోనా వ్యాక్సిన్ తయారుచేయడమే కాక… ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇండియా చేపట్టిందని ప్రధాని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 54 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నాని.. ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని అన్నారు. అందరి అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్న వీటిలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు.