టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. బాలకృష్ణ ఇప్పటివరకు ఎంతో మంది దర్శకులతో పని చేశారు. అయితే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ మొట్టమొదటిసారిగా “అనసూయమ్మ గారి అల్లుడు” చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో “తిరగబడ్డ తెలుగు బిడ్డ” అనే సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విషయానికి వస్తే బాలకృష్ణకు ఈ సినిమాలో నటించడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఈ సినిమా కథ వినగానే ఈ సినిమా పక్క ఫ్లాప్ అవుతుందని బాలయ్య అంచనా వేశాడు. అందుకోసమే ఈ సినిమాలో నటించడం కోసం బాలకృష్ణ ఇష్టపడలేదు.
పరుచూరి బ్రదర్స్ తిరగబడ్డ తెలుగు బిడ్డ కథను దర్శకుడు కోదండరామిరెడ్డికి వివరించగా కథ నచ్చకపోవడంతో ఈ సినిమా చేయడానికి కోదండ రామిరెడ్డి ఒప్పుకోలేదు. ఇదే విషయమై సీనియర్ ఎన్టీఆర్ దగ్గర కోదండరామి రెడ్డి చెప్పారు. కోదండరామిరెడ్డి ఇలా చెప్పగానే పరుచూరి బ్రదర్స్ అదేంటి అన్న గారితో అలా చెప్పారు అని అడగగా.. నాకు నచ్చలేదు కాబట్టి అలా చెప్పానని కోదండ రామిరెడ్డి చెప్పుకొచ్చారు.
నచ్చకపోతే వదిలేయండి అని అప్పుడు రామారావు చెప్పినప్పటికీ ఆ తర్వాత కోదండరామి రెడ్డికి ఫోన్ చేసి నాకు సినిమాకథ బాగా నచ్చింది బాలకృష్ణతో ఈ సినిమా చేద్దామని చెప్పారు. ఈ సినిమాలో నటించడం బాలకృష్ణకు కూడా ఇష్టం లేకపోయినప్పటికీ తన తండ్రికి నచ్చడంతో తన తండ్రి కోసం ఈ సినిమాలో నటించారు.
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక సీన్ తెరకెక్కిస్తుండగా కోదండరామిరెడ్డి బాలకృష్ణతో మరొక టేక్ చేద్దామని చెప్పగా.. ప్లాపయ్యే సినిమాకు మరొక టేక్ ఎందుకని బాలకృష్ణ కామెంట్ చేసినట్లు కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముందుగా బాలకృష్ణ అనుకున్నట్టే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…