Tag Archives: balakrishna

Mokshagna: ఆ స్టార్ హీరో కథతో మోక్షజ్ఞను లాంచ్ చేయనున్న బోయపాటి… రిస్క్ చేస్తున్న బాలయ్య?

Mokshagna: ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది సినీ వారసులో హీరోలుగా కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నందమూరి బాలయ్య వారసుడు మాత్రం ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. స్టార్ హీరోల వారసులు టీనేజ్ లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటారు కానీ మోక్షజ్ఞ మూడు పదుల వయసుకు చేరువవుతున్నారు.

ఇలా ఈయన 30 సంవత్సరాల వయసుకు దగ్గర పడుతున్న ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకపోవడంతో బాలయ్య అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఐదు సంవత్సరాల నుంచి బాలకృష్ణ తన కుమారుడి సినీ ఎంట్రీ ఉంటుంది అంటూ ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలబడలేదు అయితే వచ్చే ఏడాది మాత్రం ఈయన ఎంట్రీ ఉంటుందని గతంలో బాలయ్య చెప్పారు.

ఇకపోతే ప్రస్తుతం మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం తనని తాను పూర్తిగా మలుచుకున్నారని తెలుస్తుంది. ఈ ఎలక్షన్ హడావిడి పూర్తి కాగానే బాలయ్య ఫోకస్ మొత్తం మోక్షజ్ఞ పైనే ఉంటుందని సమాచారం అయితే ఈయనని ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం బోయపాటికి ఇచ్చారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ కథతో..
బోయపాటి శ్రీను ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసి పెట్టారట గతంలో అల్లు అర్జున్ కోసం తయారు చేసుకున్నటువంటి కథతోనే మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విధంగా అల్లు అర్జున్ కథతో మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి పలువురు అభిమానులు ఈ కథతో మోక్షజ్ఞను ఇండస్ట్రీకి లాంచ్ చేస్తూ బాలయ్య రిస్క్ చేస్తున్నారేమో అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Mokshagna: బోయపాటి డైరెక్షన్లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఫిక్స్ చేసిన బాలయ్య?

Mokshagna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఈయనకు వయస్సు మీద పడుతున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య వారసుడి రాక కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ గత ఏడాది బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది తన కుమారుడు సినీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.. ఇకపోతే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతారన్న సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి అనిల్ రావిపూడి పేరు వినిపించగా మరోసారి బోయపాటి పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఇప్పటికే వీరిద్దరూ స్క్రిప్ట్ గురించి కూడా డిస్కషన్స్ పూర్తి చేశారని ఇక త్వరలోనే ఈ సినిమా పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కొడుకు ఎంట్రీ బోయపాటి పైనే భారం వేసారని తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.

బోయపాటి పైనే భారం..
ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి టైం ఫిక్స్ చేశారని ఇక ఈయన బోయపాటి డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ తన కుమారుడి మొదటి సినిమా కూడా ఇలాంటి యాక్షన్ టచ్ ఇస్తేనే బాగుంటుందని భావించినటువంటి బాలయ్య బోయపాటిని ఫిక్స్ చేశారట.

AP politics: లోకేష్ పవన్ కు పోటీగా మహిళ అభ్యర్థులు.. మహిళలను రంగంలోకి దింపిన జగన్?

AP politics: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు అభ్యర్థుల జాబితాను తెలియజేశారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలలో అందరీ చూపు రెండు నియోజక వర్గాల పైనే ఉంది.

ఒకటి పిఠాపురం కాగా మరొకటి మంగళగిరి. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు కానీ ఈసారి గెలవాలనే ఉద్దేశంతో ఈయన పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కి పోటీగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వంగా గీతా రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ఈమె ఈసారి ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు.

ఇక మంగళగిరిలో గత ఎన్నికలలో నారా లోకేష్ పోటీ చేసే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో ఈయన మరో నియోజకవర్గానికి వెళ్లకుండా ఈ ఎన్నికలలో కూడా అక్కడే విజయం సాధించాలన్న ధీమాతో మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక మంగళగిరి నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఈసారి ముడుగూరు లావణ్య అనే మహిళను జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపారు.

పోటీగా మహిళా అభ్యర్థులు..
ఇక వీరిద్దరికీ మాత్రమే కాకుండా బాలయ్యకు పోటీగా కూడా మహిళా అభ్యర్థిని నిలబెట్టడం గమనార్హం హిందూపురం నుంచి బాలయ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి దీపిక రంగంలోకి దిగారు. ఇలా ఈ ముగ్గురికి పోటీగా జగన్మోహన్ రెడ్డి మహిళా అభ్యర్థులను నియమించి భారీ ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈ ఎన్నికలలో ఈ ముగ్గురు గెలిస్తే పర్వాలేదు కానీ లేకుంటే మహిళల చేతిలో ఓడిపోయారనే ఆపవాదం మూట కట్టుకోవాల్సి వస్తుందని చెప్పాలి.

Balakrishna: బాలయ్యకు అలాంటి మాటలు అంటే అస్సలు నచ్చవా… వింటే దబిడిదిబిడేనా?

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ఎంతో అద్భుతమైన విషయాన్ని సొంతం చేసుకోవడంతో బాలయ్య తన తదుపరి చితాన్ని డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఇక బాలకృష్ణ సినిమాలు అంటే ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే ఈయన మహిళలకు పెద్ద ప్రాధాన్యత ఇస్తారు. తన సినిమాలలో మహిళలను ఎంతో గౌరవిస్తూ నటిస్తారు మహిళలను ఎవరైనా కించపరిచే విధంగా మాట్లాడితే బాలయ్య వారికి లెఫ్ట్ రైట్ ఇస్తూ ఉంటారు. ఇలా బాలయ్య సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి.

అయితే నిజ జీవితంలో కూడా బాలయ్యకు కొన్ని పదాలు అసలు నచ్చవని తెలుస్తుంది. నిజజీవితంలో కూడా ఎవరైనా తన ముందు మహిళలను అగౌరవ పరుస్తూ వారి పట్ల నీచంగా మాట్లాడితే కనుక బాలకృష్ణ తన విశ్వరూపాన్ని చూపిస్తారని తెలుస్తోంది.

మహిళలను గౌరవించడం..
మహిళల గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడిన వారిని అవమానపరిచిన వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించిన ముందు ఎవరున్నారు అనే విషయాన్ని కూడా ఈయన ఆలోచించకుండా వారికి తన స్టైల్ లో బుద్ధి చెబుతారట అందుకే బాలయ్య ఉంటే కనుక అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆచితూచి మాట్లాడటం చేస్తూ ఉంటారని తెలుస్తోంది.

Balakrishna: సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్న బాలయ్య.. అదే ప్రధాన కారణమా?

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి బాలయ్య అద్భుతమైనటువంటి హిట్ అందుకున్నారు.

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బాబీ డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా కూడా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా షూటింగుకు బాలకృష్ణ బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది ఏకంగా రెండు నెలలపాటు సినిమా షూటింగ్లకు ఈయన దూరం కాబోతున్నారు.

వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి బాలయ్య ఉన్నఫలంగా షూటింగుకు బ్రేక్ ఇవ్వడానికి కారణం లేకపోలేదు. మరి కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నటువంటి తరుణంలో ఈయన ఎన్నికలలో బిజీ కానున్నారు ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ వచ్చే ఎన్నికలలో కూడా అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు.

ఎన్నికలలో బిజీబిజీ…

ఇలా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఈయన సినిమా షూటింగులు అన్నింటికీ కూడా కాస్త బ్రేక్ ఇచ్చేసి రాజకీయాలలో బిజీ కానున్నారు ఎన్నికలలో భాగంగా పెద్ద ఎత్తున హిందూపురం నియోజకవర్గంలో మాత్రమే కాకుండా ఏపీ అంతటా కూడా బాలకృష్ణ పర్యటించబోతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించే పనులలో బాలయ్య బిజీ కాబోతున్నారని తెలుస్తుంది.

Mokshagna: బాలయ్య సీక్వెల్ సినిమాతో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ… ఇదైనా నిజమేనా?

Mokshagna: నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అభిమానులు కానీ ఇప్పటివరకు ఈయన ఎంట్రీ గురించి ఏ విషయం కూడా క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు దీంతో అభిమానులు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఆశలు కూడా వదులుకున్నారు.

ఇకపోతే తాజాగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మోక్షజ్ఞ ఎంట్రీ ఈసారి కచ్చితంగా ఉండబోతుంది అంటూ ఒకానొక సందర్భంలో బాలకృష్ణ కూడా కామెంట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది ఏ డైరెక్టర్ లాంచ్ చేస్తారు అనే విషయానికి వస్తే..

మోక్షజ్ఞ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడంలేదని ఈయన తన తండ్రి సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తూ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు అంటూ తెలుస్తుంది. బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి అఖండ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతుందని గతంలో బోయపాటి తెలిపారు.

గ్రాండ్ ఎంట్రీ… ఇదైనా నిజమేనా?

ఇప్పటికే అఖండ సీక్వెల్ సినిమా స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని ప్రస్తుతం బాలయ్య నటిస్తున్నటువంటి సినిమా షూటింగ్ పూర్తి కాగానే అఖండ సీక్వెల్ షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మోక్షజ్ఞ కోసం బోయపాటి స్పెషల్ రోల్ క్రియేట్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా బోయపాటి శ్రీను మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలోనైనా ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Balakrishna: సుహాసినితో నాది జన్మజన్మల అనుబంధం… షాకింగ్ కామెంట్స్ చేసిన బాలకృష్ణ!

Balakrishna: బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎంత మంచి ఆదరణ పొందిందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని మూడవ సీజన్ కూడా ప్రసారమవుతుంది. ఇప్పటికే ఈ సీజన్లో రెండు ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. మూడవ ఎపిసోడ్ కి సంబంధించినటువంటి ప్రోమో ఇటీవల విడుదలైంది.

ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి సీనియర్ నటి సుహాసిని అలాగే శ్రీయ డైరెక్టర్ హరీష్ శంకర్ తో పాటు జయంతి సి పరాంజీ కూడా హాజరయ్యారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలోకి వీరందరూ ఎంట్రీ ఇవ్వగానే బాలకృష్ణ గారికి వెల్కమ్ చెప్పడమే కాకుండా సుహాసినితో తనకున్నటువంటి అనుబంధం గురించి తెలియజేశారు.

ఇక వీరిద్దరూ కలిసి పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ నాకు సుహాసినికి జన్మజన్మల అనుబంధం ఉందని తెలియజేశారు. ఇక శ్రియతో నాకు మిలీనియం బంధం ఉంది అంటూ బాలయ్య ఈ సందర్భంగా తెలిపారు. సుహాసిని బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతూ అప్పట్లో బాలకృష్ణ గారు ఎంతో సిగ్గుపడేవారు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీయ గట్టిగా అరిచేశారు.

పాత కక్షలు ఉన్నాయి…

వెంటనే హరీష్ శంకర్ మీరు చెప్పే మాటలు నమ్మశక్యంగా లేవు అనడంతో వెంటనే బాలయ్య నువ్వు అసలు మాట్లాడుకు నువ్వు ఒక పక్కన కూర్చో అంటూ చెప్పారు. దీంతో జయంత్ ఎందుకలా అని ప్రశ్నించడంతో బాలయ్య మాట్లాడుతూ ఆయనతో నాకు పాత కక్షలు చాలా ఉన్నాయని బాలయ్య చెప్పటం గమనార్హం. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రోమో వైరల్ గా మారింది.

Balakrishna: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన బాలయ్య… అంచలంచలుగా ఎదిగావంటూ ప్రశంసలు?

Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.ఇక తెలంగాణ ఎన్నికలలో ఫలితాలు విడుదలైన అనంతరం కాంగ్రెస్ పార్టీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయం గురించి ఇప్పటికే చర్చలు జరిగి అనంతరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రకటించారు.

ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నియమితులు కావడంతో ఎంతో మంది అభిమానులు రాజకీయ నాయకులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి అనుముల రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు. ప్రజా సేవ పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి ఎదిగారు. తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చాలని, అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిపదంగా ముందుకు పోవాలని ఆశిస్తున్నాను.

నమ్మకాన్ని వమ్ము చేయకుండా…

ముఖ్యమంత్రి మీ పాలన మార్క్ తో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలుస్తోంది.

Akhanda Sequel: అఖండ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన బోయపాటి… సంతోషంలో నందమూరి ఫ్యాన్స్!

Akhanda Sequel: బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో సినిమా అంటేనే నందమూరి అభిమానులకు పూనకాలు వస్తాయని చెప్పాలి. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించాయి. అలాంటిది మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే విషయం తెలియడంతో నందమూరి అభిమానుల సంతోషానికి అవధులు లేవు.

బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో చివరిగా వచ్చిన చిత్రం అఖండ ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిన మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయంలో నటించి మెప్పించారు.ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలు పై డైరెక్టర్ బోయపాటి శ్రీను స్పందించారు.

తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి స్కంద సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి బాలయ్య కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ అఖండ సీక్వెల్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Akhanda Sequel:

ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ ప్రస్తుతం తాను స్కంద హడావిడిలో ఉన్నానని ఈ హడావిడి కాస్త పూర్తి కాగానే అఖండ సినిమా పనులు మొదలవుతాయని తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్లానింగ్స్ జరుగుతున్నాయని త్వరలోనే వీటన్నింటిని అధికారికంగా తెలియజేస్తామని బోయపాటి తెలిపారు.ఇలా బోయపాటి చేసిన ఈ వ్యాఖ్యలు విన్నటువంటి బాలయ్య అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈయన మాటలు బట్టి చూస్తే ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుందని తెలుస్తుంది.

Mokshagna: మోక్షజ్ఞ సినీ కెరియర్ పై బాంబు పేల్చిన వేణు స్వామి… షాక్ లో నందమూరి ఫ్యాన్స్!

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు.. నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడిగా ఈయన అందరికీ ఎంతో సుపరిచితమే.అయితే బాలకృష్ణ తో పాటు సమానంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి హీరోల పిల్లలు ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమాలలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలోనే నందమూరి అభిమానులు బాలయ్య కుమారుడి కోసం ఎదురుచూస్తున్నారు.

బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారా ఎప్పుడు ఈయన ఇండస్ట్రీలోకి రాబోతున్నారా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అయితే గత ఐదు సంవత్సరాలుగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడ లేదు.

ఇకపోతే ఈ ఏడాది కచ్చితంగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండబోతుంది అంటూ బాలకృష్ణ కూడా ధీమా వ్యక్తం చేశారు అయితే తాజాగా మోక్షజ్ఞ జాతకం గురించి ఆయన సినీ కెరియర్ గురించి వేణు స్వామి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు మోక్షజ్ఞ ప్రస్తావన రాగా ఈయన జాతకం చూసారా ఆయన జాతకం ఎలా ఉండబోతోంది అంటూ యాంకర్ ప్రశ్నించారు.

Mokshagna: మూడు సంవత్సరాల వరకు ఎదురుచూడాల్సిందేనా…

ఈ ప్రశ్నకు వేణు స్వామి సమాధానం చెబుతూ తాను మోక్షజ్ఞ జాతకం చూసానని ఆయన కెరియర్ పరంగా ఎంతో అద్భుతమైన జాతకం అని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలోనే ఎంతో మంచి సక్సెస్ అందుకుంటారని వేణు స్వామి తెలిపారు. అయితే ఆయన మరో మూడు సంవత్సరాల పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టరో అంటూ వేణు స్వామి చేసినటువంటి ఈ కామెంట్ నందమూరి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి.