Categories: Movie News

Fish Venkat : “మరీ ఇంత చిన్న చూపా?” ఫిష్ వెంకట్ విషయంలో సినీ పరిశ్రమ నిర్లక్ష్యం?

హైదరాబాద్: సినీ నటుడు ఫిష్ వెంకట్ (వయసు 53) మృతి వార్త తెలుగు సినీ ఇండస్ట్రీకి షాక్‌ను మిగిల్చింది. గత కొంతకాలంగా మూత్రపిండ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఎప్పుడూ హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటుడు ఇక లేడని వార్త వినగానే అభిమానుల హృదయాలు భరించలేకపోయాయి. అయితే, ఆయన మృతికి సంబంధించి సినీ పరిశ్రమపై కొన్ని విమర్శలు, చర్చలు మొదలయ్యాయి. “ఇండస్ట్రీలో చిన్న నటులు అంటే మరీ ఇంత చిన్న చూపా?” అనే ప్రశ్న ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది.

Is the film industry neglected Fish Venkat?

అనారోగ్యం, చికిత్సకు ఆర్థిక కష్టాలు

సినీ ఇండస్ట్రీకి తనదైన కామెడీ టైమింగ్‌తో వందల సినిమాల్లో నవ్వులు పంచిన ఫిష్ వెంకట్, అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమయ్యాడు. కిడ్నీలు పూర్తిగా ఫెయిలవడంతో డయాలసిస్‌పై ఆధారపడే పరిస్థితికి చేరాడు. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వెంకట్, చివరకు తుదిశ్వాస విడిచాడు. అయితే ఆయన చికిత్స సమయంలో సినీ ప్రముఖుల నుంచి సరైన స్పందన లేకపోవడం బాధ కలిగించే అంశంగా మారింది.

అందిన సహాయం, అందని దాత.. ప్రశ్నార్థకంగా మారిన సినీ ప్రముఖుల పాత్ర

ప్రముఖులు సహాయం చేయలేదన్నది కాదు. మొదట్లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌లు స్పందించి చికిత్స ఖర్చులకు సహాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ప్రారంభంలో డిప్యూటీ సీఎం హోదాలో ఫిష్ వెంకట్ చికిత్సకు డబ్బు మంజూరు చేసినట్టు తెలిసింది. ప్రభాస్‌ తరఫు నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని వెంకట్ కుమార్తె వివరించింది. ఆయన టీం మాట్లాడుతూ, కిడ్నీ దాత దొరికితే అవసరమైన ఖర్చులు భరిస్తామని చెప్పారు. కానీ, ప్రధాన సమస్య కిడ్నీ డోనర్ లభ్యం కావడంలోనే ఉండిపోయింది. రూ.50-60 లక్షలు ఉంటే తన తండ్రి బ్రతికేవారని ఆయన కుమార్తె ఆవేదన వ్యక్తం చేసింది.

నెటిజన్ల ఆగ్రహం: “మా” ఎక్కడ? స్టార్స్ ఎక్కడ?

అయితే, వెంకట్‌ జీవితాన్ని నిలబెట్టే ప్రయత్నం మరింత బలంగా ఉండాల్సిందని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. “రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మొదట్లో స్పందించినా… చివరిదాకా చొరవ చూపించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో” అనే ప్రశ్నలు నెట్టింట ప్రత్యక్షమవుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్‌కి అపోలో హాస్పిటల్‌తో సంబంధాలుండగా, కిడ్నీ డోనేషన్ విషయంలో మరింత సహకారం అందించవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇంకొంతమంది “సినిమా రంగానికి చెందినవారే… ఇకనైనా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సీరియస్‌గా ఆలోచించాలి” అంటూ అసోసియేషన్‌పై విమర్శలు చేస్తున్నారు. “మంచు విష్ణు ఎక్కడ ఉన్నాడు?” అనే సెటైర్లు కూడా కనిపిస్తున్నాయి.

వాస్తవానికి, ఫిష్ వెంకట్ అనేక కథా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ప్రత్యేక ముద్ర వేశారు. పెద్దగా న్యూస్‌లో ఉండకపోయినా, పరిశ్రమలో ఎంతో గౌరవించబడే హాస్యనటుల్లో ఆయన ఒకరు. ఆయన చనిపోవడం కంటే, చివరి రోజుల్లో ఆయనకు సరైన సహాయం అందలేదన్న భావన నెటిజన్లలో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. చివరికి, “తమతమ పనుల్లో బిజీ అయిన స్టార్స్‌కి.. ఇలా ఓ సహజ నటుడి పరిస్థితి గుర్తుకు రాలేదా?” అన్న చర్చ ఇప్పుడు తీవ్రంగా నడుస్తోంది. ఈ ఘటన తెలుగు సినీ పరిశ్రమలో చిన్న నటుల పట్ల ఉన్న వైఖరిపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago