Tag Archives: allu arjun

Allu Arjun: బన్నీ, అట్లీ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సమంత?

Allu Arjun: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా డేట్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇకపోతే ఈ సినిమా వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాలో నటించబోతున్నాడు అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

అయితే అల్లు అర్జున్ తదుపరి సినిమా ఆ డైరెక్టర్ తోనే అంటూ ఇప్పటికే చాలామంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. కానీ వాటిలో ఏది కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే గత కొద్ది రోజులుగా బన్నీ నెక్స్ట్ సినిమా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతోనే అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ మూవీ వర్క్ కూడా స్టార్ట్ అయిందని ఇటీవల ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ సినిమాతో సమంత రీ ఎంట్రీ ఇస్తున్నారట. ఖుషి సినిమా తరువాత సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అట్లీ సినిమాతో రీ ఎంట్రీ

తన అనారోగ్యం నుంచి కోలుకోవడం కోసం చికిత్స తీసుకుంటూ వస్తున్న సమంత, అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఓకే చెప్పారట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు. కాగా సమంత గతంలో అట్లీ తెరకెక్కించిన మెర్సల్, తేరి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. అలాగే ఇక అల్లు అర్జున్‌తో కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నటించింది సామ్. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు తన రీ ఎంట్రీకి ఈ హిట్ కాంబినేషన్ అయితేనే పర్ఫెక్ట్ అని సమంత భావించినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని అల్లు అర్జున్ బర్త్ డే నాడు అనౌన్స్ చేయబోతున్నారట. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజునే ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి మేకర్స్ సిద్దమవుతున్నారట.

Allu Arjun: మైల్ స్టోన్ మూమెంట్.. వైరల్ అవుతున్న అల్లు అర్జున్ మైనపు విగ్రహం?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. పుష్ప సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. దీంతో ఈయనకు ఉత్తమ జాతీయ నటుడు అనే అవార్డు కూడా వచ్చింది.

ఇలా ఉత్తమ జాతీయ నటుడు అవార్డును అందుకున్నటువంటి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక ఈయన హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా దుబాయ్ లో ఉన్నటువంటి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏకంగా ఈయన మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఈ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో 28వ తేదీ మార్చి రాత్రి 8 గంటలకు ఈ విగ్రహాన్ని అల్లు అర్జున్ తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి అల్లు అర్జున్ మైల్ స్టోన్ మూమెంట్ అంటూ ఈ ఫోటోలను షేర్ చేయగా ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

పుష్ప రాజ్ గెటప్..
ఇలా దుబాయ్ లో మైనపు విగ్రహం ఏర్పాటు చేయటంతో ఎంతోమంది అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ విగ్రహం కూడా పుష్పరాజ్ గెటప్ లో ఉండటం విశేషం. ఇకపోతే దుబాయ్ మ్యూజియంలో ఈ విధంగా మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి సౌత్ ఇండియన్ నటుడిగా అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలను పొందారు. ఇప్పటివరకు ఈ మ్యూజియంలో ఏ సౌత్ సెలబ్రిటీ విగ్రహం లేకపోవడం గమనార్హం.

Allu Arjun: అలాంటి గౌరవం అందుకున్న తొలి నటుడిగా రికార్డ్ సాధించిన బన్నీ.. ఏమైందంటే?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాలో నటించినందుకుగాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ అవార్డు ఏ హీరో అందుకోలేదని, జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నటువంటి తొలి హీరోగా అల్లు అర్జున్ గుర్తింపు పొందారు.

ఇలా పుష్ప సినిమాలోని తన నటనకు ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకోవడమే కాకుండా మరో అరుదైన గుర్తింపును కూడా సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయిలోని మేడం టుసాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే ఈ మైనపు విగ్రహం తయారు చేయడం పూర్తి అయిందని ఈనెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు ఈ విగ్రహం అల్లు అర్జున్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అల్లు అర్జున్ కుటుంబం మొత్తం దుబాయ్ చేరుకున్నారు. అయితే ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రభాస్ మహేష్ బాబు వంటి హీరోల మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు అయితే అవి లండన్ లో ఉన్నాయి.

గోల్డ్ వీసా…
ఇక దుబాయిలో ఈ మ్యూజియంలో ఇప్పటివరకు ఏ సౌత్ సినీ సెలబ్రిటీల విగ్రహాలను ఏర్పాటు చేయలేదు మొదటిసారి అల్లు అర్జున్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈయన మరో ఘనత సొంతం చేసుకున్నారు. ఇక ఈ విగ్రహా ఏర్పాటు మాత్రమే కాకుండా దుబాయ్ గోల్డ్ వీసా అందుకున్నటువంటి తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ ఘనత సాధించడం విశేషం.

Allu Arjun: అల్లు అర్జున్ కు ఇష్టమైన హీరోయిన్ తనేనా… ఇప్పటివరకు ఆ అవకాశం రాలేదా?

Allu Arjun: సాధారణ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా హీరో హీరోయిన్లకు కూడా ఇష్టమైనటువంటి సెలబ్రిటీలో ఉంటారనే సంగతి మనకు తెలిసింది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు హీరోలు లేదా హీరోయిన్లు ఇండస్ట్రీలో వారికి ఎంతో ఇష్టమైనటువంటి సెలబ్రిటీల గురించి బయట పెడుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు అల్లు అర్జున్ ఒకరు. ఈయన కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఇలా ఎందరికో ఇండస్ట్రీలో అభిమాన హీరోగా మారిపోయినటువంటి ఈయనకు సెలబ్రిటీలు కూడా అభిమానులుగా ఉన్నారు. ఇక హీరోయిన్లకు ఈయన క్రష్ గా కూడా మారిపోయారనే సంగతి మనకు తెలిసిందే. మరి ఇంతమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ కి ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరోయిన్ ఉన్నారట అయితే ఆయనతో మాత్రం ఈయన నటించలేదని తెలుస్తుంది.

సావిత్రి అంటే అంత ఇష్టమా..
మరి అల్లు అర్జున్ ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని వస్తే ఆమె మరెవరో కాదు సీనియర్ నటి దివంగత సావిత్రి గారు అంటే అల్లు అర్జున్ కి ఎంతో ఇష్టమట. ఆమె నటన తనని ఎంతగానో ఆకర్షించిందని అందుకే ఆమెకు తాను అభిమానిగా మారిపోయానని ఈయన పలు సందర్భాలలో వెల్లడించారు.

Mokshagna: ఆ స్టార్ హీరో కథతో మోక్షజ్ఞను లాంచ్ చేయనున్న బోయపాటి… రిస్క్ చేస్తున్న బాలయ్య?

Mokshagna: ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది సినీ వారసులో హీరోలుగా కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నందమూరి బాలయ్య వారసుడు మాత్రం ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. స్టార్ హీరోల వారసులు టీనేజ్ లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటారు కానీ మోక్షజ్ఞ మూడు పదుల వయసుకు చేరువవుతున్నారు.

ఇలా ఈయన 30 సంవత్సరాల వయసుకు దగ్గర పడుతున్న ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకపోవడంతో బాలయ్య అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఐదు సంవత్సరాల నుంచి బాలకృష్ణ తన కుమారుడి సినీ ఎంట్రీ ఉంటుంది అంటూ ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలబడలేదు అయితే వచ్చే ఏడాది మాత్రం ఈయన ఎంట్రీ ఉంటుందని గతంలో బాలయ్య చెప్పారు.

ఇకపోతే ప్రస్తుతం మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం తనని తాను పూర్తిగా మలుచుకున్నారని తెలుస్తుంది. ఈ ఎలక్షన్ హడావిడి పూర్తి కాగానే బాలయ్య ఫోకస్ మొత్తం మోక్షజ్ఞ పైనే ఉంటుందని సమాచారం అయితే ఈయనని ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం బోయపాటికి ఇచ్చారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ కథతో..
బోయపాటి శ్రీను ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసి పెట్టారట గతంలో అల్లు అర్జున్ కోసం తయారు చేసుకున్నటువంటి కథతోనే మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విధంగా అల్లు అర్జున్ కథతో మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి పలువురు అభిమానులు ఈ కథతో మోక్షజ్ఞను ఇండస్ట్రీకి లాంచ్ చేస్తూ బాలయ్య రిస్క్ చేస్తున్నారేమో అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Allu Sneha Reddy: అల్లు అర్జున్ నటించిన ఆ సినిమా అంటే స్నేహ రెడ్డికి అంత ఇష్టమా?

Allu Sneha Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కూడా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా వీరిద్దరూ దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. ఇక ఈ దంపతులకు ఇద్దరు సంతానం కూడా కలరు. ఇక అల్లు అర్జున్ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండగా స్నేహ రెడ్డి తన పిల్లల బాధ్యతలను కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

ఈ క్రమంలో అల్లు అర్జున్ నటించిన ఏ సినిమా అంటే స్నేహ రెడ్డికి ఇష్టం అనే విషయం గురించి ఒక వార్త వైరల్ గా మారింది. అల్లు అర్జున్ నటించినటువంటి సినిమాలలో ఆర్య సినిమా అంటే స్నేహ రెడ్డికి చాలా ఇష్టం అని తెలుస్తుంది. గంగోత్రి సినిమా ద్వారా హీరోగా పరిచయమైనటువంటి అల్లు అర్జున్ ఆర్య సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా లవర్ బాయ్ గా ఎంతో మంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఆర్య..
ఆర్య సినిమా అంటే అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ఇక స్నేహ రెడ్డికి కూడా ఈ సినిమా అంటే చాలా ఇష్టం అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడి ఉన్నాయి.

Samantha: ఆ హీరో అంటే సమంతకు అంత క్రష్ ఉందా.. ఎవరా హీరో?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమంత ప్రస్తుతం కెరియర్ కు కాస్త విరామం ప్రకటించి తన ఆరోగ్యాన్ని కాపాడుకునే పనులలో ఉన్నారు.. సమంత మయోసైటిసిస్ వ్యాధికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఈమె సినిమాలకు కాస్త విరామం ప్రకటించి పూర్తిగా ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా సమంత ఇండియా టుడే కాన్ క్లేవ్ 2024 న్యూఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరవ్వడానికంటే ముందుగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఈ క్రమంలోనే సమంతకు ఇండస్ట్రీలో క్రష్ ఎవరు అనే విషయాన్ని కూడా ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు. నాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి షారుక్ ఖాన్ గారు అంటే ఎంతో గౌరవం అని తెలియజేశారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ప్రభాస్ తో ఇప్పటివరకు ఈమె నటించకపోయినా ప్రభాస్ అంటే తనకు చాలా గౌరవమని తెలిపారు.

అల్లు అర్జున్..
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ నా క్రష్ అంటూ ఈ సందర్భంగా సమంత చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ నాకు అల్లు అర్జున్ సినీ రోల్ మోడల్ అని చెప్పినటువంటి ఈమె ఇప్పుడు అల్లు అర్జున్ తన క్రష్ అంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rashmika: పుష్ప భార్యగా నాపై బాధ్యత పెరిగింది.. రష్మిక కామెంట్స్ వైరల్!

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ఇటీవల జపాన్ వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా టోక్యోలో జరిగిన క్రంచీ రోల్ అనిమే అవార్డ్స్ వేడుకలలో పాల్గొంది. ఈ ఈవెంట్ కు హాజరైన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తన అప్ కమింగ్ మూవీస్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె పుష్ప 2 గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పుష్ప సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలుగా చిత్ర బృందంతో కలిసి తాను కలిసి షూటింగ్లో పాల్గొనడం గురించి ఆసక్తికర విషయాలు తెలిపారుని రోజులు నేను పుష్ప రాజ్ ప్రేయసిగా మాత్రమే ఉన్నాను అయితే ఇప్పుడు మాత్రం పుష్ప భార్య. అది చాలా బాధ్యతలతో నిండి ఉన్న పాత్ర. సీక్వెల్ లో చాలా ఎక్కువ డ్రామా, పాత్రల సంఘర్షణలు ఉన్నాయి. అలాగే ఈ లో ఎక్కువగా మసాలా ఉంటుందని తెలిపారు.

భార్యగా నాపై బాధ్యతలు పెరిగాయి…
డైరెక్టర్ సుకుమార్ వంటి పర్ఫెక్షనిస్ట్ దర్శకుడితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని.. పుష్ప 2 పై ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉన్నాయని అయితే ఆ అంచనాలను ఈ సినిమా చేరుకుంటుంది అంటూ ఈ సందర్భంగా రష్మిక పుష్ప సీక్వెల్ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ఇటీవల బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

Allu Arjun: అల్లు అర్జున్ కి ఆ హీరో అంటే అంత ఇష్టమా… హీరో ఎవరంటే?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో అభిమానుల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇక ఈ సినిమాలో ఈయన నటనకు నేషనల్ అవార్డు కూడా వరించింది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మొట్టమొదట నేషనల్ అవార్డు అందుకున్నటువంటి హీరోగా అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ కి ఒక హీరో అంటే చాలా ఇష్టం అని తెలుస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఆ హీరోకి అల్లు అర్జున్ డై హార్ట్ ఫ్యాన్ అని చెప్పాలి.

అమితాబ్ అంటే అంత ఇష్టమా…
ఇక అల్లు అర్జున్ అంతలా అభిమానించే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు బాలీవుడ్ బిగ్ బి నటుడు అమితాబ్ బచ్చన్ అంటే అల్లు అర్జున్ కి చాలా ఇష్టమని ఆయనే తన ఫేవరెట్ హీరో అంటూ ఓ సందర్భంలో వెల్లడించారు. జంజీర్ మూవీ అంటే చాలా ఇష్టం అంటూ ఈయన చెప్పడంతో అమితాబ్ బచ్చన్ ను అభిమానించే వారు కూడా బన్నీ వ్యాఖ్యలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Sneha Reddy: అల్లు అర్జున్ భార్యలో ఈ టాలెంట్ గురించి తెలుసా?

Sneha Reddy: నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్నారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్నేహ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ హీరోయిన్ ని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఈమె మోడల్ గా పనిచేస్తూ ఎన్నో రకాల స్టైలిష్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

ఇక తన కుటుంబానికి తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్నారు. ఇలా ఎప్పటికప్పుడు అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నటువంటి ఈమె మొదటిసారి ఓ ప్రమోషనల్ యాడ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ యాడ్లో ఈమె చాలా అందంగా కనిపించడమే కాకుండా చాలా సహజంగా నటించారు.

మంచి సింగర్..

మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన నటన కనపరచినటువంటి స్నేహ రెడ్డి ఇండస్ట్రీలోకి వస్తే మంచి సక్సెస్ అవుతుందని పలువురు భావించారు. అయితే ఈమెలో ఎవరికీ తెలియని మరో టాలెంట్ కూడా దాగి ఉందని తెలుస్తుంది. ఈమె ఎంతో అద్భుతంగా పాటలు పాడుతుందని తెలుస్తుంది. బయట ఎక్కడ పాడకపోయినా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆకేషన్స్ లో మాత్రం ఈమె పాటలు పాడుతూ అందరినీ మెప్పిస్తూ ఉంటారట. ఈ విషయం తెలిసే అభిమానులు స్నేహ రెడ్డి మల్టీ టాలెంటెడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.