Movie News

పవన్ ఫ్యాన్స్ గోల తట్టుకోలేక స్క్రీన్ ముందు ఫెన్సింగ్.. థియేటర్ యజమాని కష్టాలు మామూలుగా లేవు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, సినిమాపై రివ్యూస్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. క్రిటిక్స్ అత్యధికంగా 2 నుంచి 2.5 రేటింగ్స్ ఇచ్చారు. దీంతో యావరేజ్ టాక్ వినిపిస్తోంది.

The theater owner’s troubles with pawan kalyan fans

సంధ్య థియేటర్ వద్ద కఠిన భద్రతా చర్యలు

అయితే టాక్ ఎలా ఉన్నా, పవన్ ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షోను ఒక పండగలా చేసుకుంటారు. థియేటర్లలో నానా హంగామా చేస్తారు. బ్యానర్లు, పూల వర్షాలు, బాణాసంచాలతోపాటు.. కొంతమంది స్క్రీన్ మీదకే ఎక్కిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో స్క్రీన్‌ను కూడా పగులకొడతారు. ఇది నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలకు తలనొప్పిగా మారుతోంది.

ఈ తరహా హంగామా కట్టడికి హైదరాబాద్‌లోని ప్రసిద్ధి గాంచిన సంధ్య థియేటర్ యాజమాన్యం వినూత్న చర్యలు తీసుకుంది. స్క్రీన్ ముందు ఇనుప కంచెలతో పాటు ముళ్లతో కూడిన ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాదు, పైన మొలలు ఉండేలా స్టీల్ స్ట్రిప్‌లను అమర్చారు. దీంతో ఎవరైనా దాన్ని దాటి స్క్రీన్ వైపు వెళితే గాయాలే గాక, ప్రాణాలకే ప్రమాదమవుతుందని చెబుతున్నారు.

పైన మాత్రమే కాదు, కింద కూడా భద్రతా చర్యలు తీసుకున్నారు. సీట్ల మధ్య సిమెంట్ ఇటుకలు పెట్టి, కుర్చీలు దెబ్బతినకుండా చూసుకున్నారు. థియేటర్ యాజమాన్యం తీసుకున్న ఈ భద్రతా చర్యలు, ఫ్యాన్స్ వెర్రి చేష్టలకు ఎదురుగా వారు పడుతున్న కష్టాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నెటిజన్ల స్పందన

ఈ వీడియోను చూసిన నెటిజన్లు “ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండండి”, “ఇది సినిమా.. మీ ప్రాణాలు కాదు” అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు, పవన్ అభిమానుల లోకం మరోసారి వార్తల్లో నిలిచింది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago