Featured

Pushpa 2: అంతా బానే ఉంది కానీ, ఆ సినిమా రికార్డులను మాత్రం టచ్ చేయలేకపోతున్న పుష్ప2!

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప 2. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఇప్పటికే 1700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా అతి త్వరలోనే RRR దంగల్ సినిమా రికార్డులను కూడా బద్దలు కొడుతుందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డును మాత్రం టచ్ కూడా చేయలేకపోతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా 270 కోట్ల రూపాయలు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి సలార్ దేవర వంటి సినిమాలు కూడా ఈ రికార్డును టచ్ చేయలేకపోయాయి అయితే ఈ రికార్డును మాత్రం పుష్పరాజ్ చేస్తారని అందరూ భావించారు కానీ ఆయన వల్ల కూడా కాలేదని తెలుస్తోంది. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలలో పుష్ప 2 సినిమాకు రూ.210 కోట్ల షేర్ వచ్చింది. రాబోయే కలెక్షన్లు కలుపుకున్నా మరో రూ.10 కోట్లకు మించి రావని భావిస్తున్నారు.

రాజమౌళి వల్లే సాధ్యం..
ఇలా మరో 10 కోట్ల రూపాయలు అదనంగా వచ్చిన 220 కోట్ల షేర్ వరకే ఆగిపోతుంది తప్ప RRR సినిమా రికార్డును టచ్ చేయడానికి 50 కోట్ల షేర్ వద్దనే ఆగిపోతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా రికార్డును బద్దలు కొట్టాలి అంటే తిరిగి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే సినిమానే RRR రికార్డులను టచ్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago