Bobby: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు చిరంజీవి ఒకరు. ఈయన ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఇక చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది హీరోలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న సంగతి తెలుస్తుంది.
ఇదిలా ఉండగా చిరంజీవి హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ యువ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక ఇటీవల ఈయన చివరిగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. ఇక చిరంజీవితో సినిమా చేసే హిట్ అందుకున్న బాబి మరోసారి బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు.
త్వరలోనే డాకు మహారాజ్ అనే సినిమా ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 12వ తేదీ ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ బాబి కథ ఎంపిక విషయంలో చిరంజీవి బాలకృష్ణ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా బాబి ఇద్దరి హీరోల గురించి మాట్లాడుతూ…
చిరంజీవి గారికి మనం కథ చెప్పినప్పుడు ఆయన ప్రతిసారి ఆ కథ గురించి అడుగుతూనే ఉంటారు. అలాగే డైలాగ్ పేపర్ కూడా తనకు ముందే ఇవ్వాలని చెబుతారు. ప్రతి విషయంలో చాలా శ్రద్ధ పెడుతూ ఉంటారని తెలిపారు. ఇక బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలయ్య గారికి ఒకసారి కథ చెబితే మరోసారి ఆ కథ గురించి దర్శకుడుని అడగరు. ఆయన గుడ్డిగా డైరెక్టర్లను నమ్మేస్తారు. ఇక సినిమా షూటింగ్ సమయంలో కూడా డైరెక్టర్ చెబితే బాలయ్య అదే చేస్తారని తెలిపారు. ఇలా ఇద్దరు హీరోల గురించి చెప్పడంతో చిరు యాంటీ ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి గురించి కామెంట్లు చేస్తూ చిరంజీవి కథ విషయంలో ప్రతిసారి వేలు పెట్టి గెలుకుతూ ఉంటారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…