కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటికి వేదికగా ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు ఉంటాయి. అయితే వీటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించి వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటికి సమయం దొరికినప్పుడల్లా అవి ఎంజాయ్ చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో ఏనుగుకు సంబంధించిన వీడియోలు చాలా కనిపిస్తున్నాయి.
ఏనుగులు నీటిలో సరదాగా గడుపుతుంటే.. వాటిని చూడటానికి ఎంతో ఆనందంగానూ.. ఆశ్చర్యంగాను ఉంటుంది. కొంత మంది సమయం దొరకని వారు సోషల్ మీడియాలో జంతువుల సరదాను చూసి తమ సమయాన్ని గడుపుతారు. భూమిపై అతిపెద్ద జంతువు ఏనుగు.. అత్యంత తెలివైనదిగా ఏనుగును పరిగణిస్తారు. అలాంటి ఏనుగులు అల్లరి చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడొచ్చు.
ఇక్కడ ఏనుగు కుటుంబం ఒక వాలులో దిగుతూ చిన్నపిల్లలా అల్లర్లు చేయడం ప్రారంభించాయి. వీడియోలో మీరు ఏనుగుల కుటుంబం అడవిలో సరదాగా తిరుగుతున్నట్లు చూడవచ్చు. అప్పుడే క్రిందికి వాలు నుంచి జారడం చూస్తాం. మొదట ఏనుగు వాలుపై కూర్చుని కిందికి జారి వస్తుంది. దీని తర్వాత పిల్ల ఏనుగు కూడా అదే పని చేయడానికి ప్రయత్నిస్తాడు.
కానీ అది మధ్యలో ఆగి మళ్లీ పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఇలా జారడం.. మళ్లీ పైకి ఎక్కడం అనేవి ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వైరల్ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామన్ తన ట్విట్టర్ ఖాతా నుండి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనితో పాటు ఏనుగు సరదాపై చాలా మంది ఫన్నీ వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ వీడియోను నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫన్నీ వీడియోను తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…