అమెజాన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఆ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్..?

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇయర్ ఎండ్ నేపథ్యంలో అమెజాన్ మరో స్పెషల్ సేల్ ను నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరుతో అమెజాన్ ఈ సేల్ ను నిర్వహించనుంది. స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారుల కోసం అమెజాన్ ఈ సేల్ ను నిర్వహిస్తుండగా ఈ సేల్ ద్వారా మొబైల్, మొబైల్ ఫోన్లకు సంబంధించిన ఇతర వస్తువులను అమెజాన్ విక్రయించనుంది.

ఆమెజాన్ ఇప్పటికే ఒక మైక్రో సైట్ ను రూపొందించి మైక్రో సైట్ ద్వారా సేల్ లో భాగంగా విక్రయించే స్మార్ట్ ఫోన్లు, ఇతర వివరాలను విడుదల చేసింది. అమెజాన్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు ఎక్స్ ఛేంజ్ ఆఫర్లతో పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి 1,500 రూపాయల వరకు డిస్కౌంట్ ను ఇవ్వనుంది. ప్రముఖ బ్రాండ్లపై ఈ సేల్ లో అదిరిపోయే డిస్కౌంట్లను పొందే అవకాశం ఉంటుంది.

షియోమీ, హాన్సర్, శాంసంగ్, వన్ ప్లస్, నోకియా, రియల్ మీ, ఎల్జీ, జాబ్రా, ఒప్పో, యాపిల్ కంపెనీల స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. హెడ్ ఫోన్లు, పవర్ బ్యాంకులు, కవర్లు, కేబుల్ లపై కూడా అమెజాన్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈరోజు తగ్గింపు ధరలను అమెజాన్ యొక్క మైక్రో సైట్ ద్వారా చూడవచ్చు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం21, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం31, వన్‌ప్లస్ 8 టీ 5జీ, రెడ్ మీ 9 ప్రైమ్, రెడ్‌మీ నోట్ 9 ప్రో మాక్స్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం51, ఐ ఫోన్ 11, వన్‌ప్లస్ నార్డ్ 5జీ ఫోన్లను ఆఫర్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది.