ఆ ఉత్తరంతో చలించిపోయిన ఏంజెలినా జోలి.. ఆఫ్ఘాన్ ల కోసం నిలబడిన నటి.. !

బాహ్య ప్రపంచానికి, వివాదాలకు దూరంగా ఉంటూ.. హాలీవుడ్​ కు చెందిన ప్రఖ్యాత నటి ఏంజెలినా జోలి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె పలువురు సెలెబ్రెటీలకూ ఆమె రోల్​మోడల్ గా ఉంది. ఇప్పటి వరకు తనకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా లేదు. అయితే ఆమె ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ తెరిచి సంచలన ప్రకటన చేసింది. ఇలా చేయడానికి గల కారణం ఓ ఉత్తరం. ఓ ఉత్తరం ఆమెను కదిలించి అకౌంట్ ను ఓపెన్ చేయించిందని తెలిపింది.

ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముందంటే.. తాను ఆఫ్టనిస్థాన్ లో ఉద్యోగం చేసేదానిని అని.. తాలిబన్ల రాకతో ఉద్యోగం పోయి రోడ్డున పడ్డానని.. మాకు హక్కులు ఉండేవని.. తాలిబన్ల రాకతో అంతా తలకిందులు అయిపోయిందని.. ఆ ఉత్తరంలో ఓ యువతి వాపోయింది. వారిని చూసి తాము భయపడుతున్నామని..మా కలలన్నీ నీరుగారిపోయాయని.. ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాలిబన్లు మారారని కొందరు చెబుతున్నారు… నేనలా భావించడం లేదు.

ఇప్పుడు మా జీవితాలు చీకటి మయమయ్యాయి. స్వేచ్ఛను కోల్పోయాం. మళ్లీ మేం బందీలైపోయాం.. అంటూ ఆమె కన్నీటితో వ్యాఖ్యలను రాసినట్లు రాసింది. అంతే ఉత్తరం చదివి చలించిపోయింది ఏంజెలినా. అయితే దీనిపై సోషల్ మీడియా వేదికగా పోరాడతానని.. వారి గళాన్ని ప్రపంచానికి వినిపిస్తానని హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలి అన్నారు. దీని కోసమే ఆమె సోషల్ మీడియాలో ఖాతా తెరిచారు. అఫ్ఘనిస్తాన్ వాసులు తమ బాధలను పంచుకోవడినికే ఈ ఖాతాను అంకితం ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.

దీని ద్వారా ఆ దేశ పౌరుల బాధలను ప్రపంచానికి తెలియజేస్తానని తెలిపారు. అయితే ఆమె ఇన్‌స్టాలో ఖాతా ప్రారంభించిన వెంటనే ఏంజెలినా జోలికి 68 లక్షల మంది ఫాలోవర్లు రాగా.. తొలి పోస్టుకి 29 లక్షల లైక్స్‌ రావడం విశేషం. వాళ్ల ఆగడాలకు నాంది ఇక్కడ నుంచే మొదలైందంటూ.. కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.