గత కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారిలో హీరోయిన్ రాశి ఒకరు. ఈమె అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశి ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న రాశి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సందడి చేశారు. ప్రస్తుతం ఎలాంటి సినిమాలలో నటించకుండా బుల్లితెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
ఒకప్పుడు హీరోయిన్ గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రాశి నిజ జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నారనే విషయం మీకు తెలుసా.. రాశి 18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తమిళ దర్శకుడు అశోక్ సామ్రాట్ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో ఆమెపై తల్లిదండ్రులు కోపడటంతో తన అన్న సహకారంతో ఇంటి నుంచి వెళ్లిపోయి అశోక్ సామ్రాట్ ను పెళ్లి చేసుకుంది.
అప్పటికే తనకు పెళ్లి జరిగి ఉండడంతో అశోక్ సామ్రాట్ తన మొదటి భార్య దగ్గరికి వెళ్లి పోవడం వల్ల రాశి అతనితో విడాకులు తీసుకుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ లో బిజీగా మారిన రాశి ఆ తర్వాత “మనసిచ్చి చూడు” సినిమా డైరెక్టర్ సురేష్ వర్మను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య భేదాభిప్రాయాలు రావడం చేత సురేష్ వర్మ కు విడాకులు ఇచ్చారు.
ఈ విధంగా రెండవ భర్త సురేష్ వర్మతో విడిపోయిన రాశి ముచ్చటగా మూడోసారి శ్రీనివాస్ అనే వ్యక్తి ని పెళ్లి చేసుకొని తన వైవాహిక జీవితంలో ఎంతో సుఖంగా ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం బుల్లితెరపై జానకి కలగనలేదు అనే సీరియల్ ద్వారా అత్త పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…