Festival In Telangana: తెలంగాణలో మరో పండుగ.. ద్రాక్షలతో కళకళ…!

Festival In Telangana: తెలంగాణలో మరో పండుగ.. ద్రాక్షలతో కళకళ…!

Festival In Telangana: తెలంగాణలో పండుగలకు కొదవ లేదు. ప్రతీ నెల ఏదో ఒక ప్రత్యేక పండుగు ఉంటే ఉంటుంది. అందులో ముఖ్యంగా రాష్ట్ర పండుగగా గుర్తించిన పండుగ బతుకమ్మ. ఎలాంటి విగ్రహాలు లేకుండా.. సంవత్సరమంతా పూజలు అందుకేనే విధంగా కాకుండా..కేవలం పూలతో కొలిచి.. తొమ్మిదో రోజు నీళ్లలో నిమజ్జనం చేస్తుంటారు.

Festival In Telangana: తెలంగాణలో మరో పండుగ.. ద్రాక్షలతో కళకళ…!
Festival In Telangana: తెలంగాణలో మరో పండుగ.. ద్రాక్షలతో కళకళ…!

ఈ పండుగ తెలంగాణలో ఎంతో ప్రసిద్ది. అంతే కాదు.. ఈ పండుగ జాడలు విదేశాలకు కూడా పాకాయి. అక్కడ ఉన్న తెలుగు వాళ్లు ఈ పండుగను అంత్యంత సంబురంగా జరుపుకుంటారు. అంతే కాకుండా.. వాళ్లను చూసి.. విదేశియులు కూడా ఎంతో ముచ్చట పడి.. ఇష్టపడి పండుగలను జరుపుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Festival In Telangana: తెలంగాణలో మరో పండుగ.. ద్రాక్షలతో కళకళ…!

ఒక్క బతుకమ్మే కాదు.. తెలంగాణలో మేడారం జాతర, గిరిజన పండుగలు ఎన్నో ఉన్నాయి. అయితే హైదారాబాద్ నగర శివారులగా ఈ మధ్య ఓ పండుగను జరుపుకున్నారు. హైదారబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర నగరులో ఉన్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో ద్రాక్ష పళ్ళ పండుగను ఏర్పాటుచేశారు.

తాజాగా ద్రాక్ష పరిశోధనా కేంద్రంలో ..

ఇది సాంప్రదాయం ప్రకారం వస్తున్నా.. కరోనా వైరస్ తో రెండేళ్లుగా దీనిని నిర్వహించలేదు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు చక్కబడటంతో ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. తాజాగా ద్రాక్ష పరిశోధనా కేంద్రంలో ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ను ప్రారంభించారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. ప్రజలు ద్రాక్షను కొనుగోలు చేసే ముందు దానిని రుచి చూస్తారు. అంతే కాకుండా.. వాటిని స్వయంగా తమకు నచ్చిన ద్రాక్షను ఎంపిక చేసుకుంటారు. ప్రతీ సారి ఇలా నిర్వహించే వారని.. కానీ కరోనా కారణంగా గత రెండేళ్లు నిర్వహించలేదని తెలిపారు. అయితే దీనిని మూడు రోజుల పాటు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే ఎవరి ఇష్టం వచ్చిన పండ్లను వాళ్లు ఎంపిక చేసుకునే విధంగా 37 రకాల ద్రాక్ష పండ్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు.