Khiladi Movie: రవితేజ హీరోగా డింపుల్ హాయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా ఈ నెల 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఖిలాడి. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయినప్పటికీ ప్రతి ఒక్కరు ఈ సినిమాలో రవితేజ కూతురుగా నటించిన చిన్నారి పాత్ర గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఈ చిన్నారి నటనకు అందరూ ఫిదా కావడంతో ఈ చిన్నారి ఎవరు ఏంటి అని ఆరా తీస్తున్నారు.
కృష్ణ జిల్లా నందిగామకి చెందిన చిన్నారి శాన్విత నాలుగేళ్ల వయసులోనే సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.ఈమె తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు వీరికి ఇద్దరు కూతుళ్లు కాగా చిన్న కూతురు శాన్విత ఇప్పటికి ఏడు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.
ఇంత చిన్న వయసులోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నారికి ఇలాంటి అవకాశాలు రావడంతో ఈమె తల్లిదండ్రులు మందడపు రంగనాధ్, పరిమిళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమెకు ఇండస్ట్రీలోకి ఎలా అవకాశం వచ్చింది అనే విషయానికి వస్తే…
హైదరాబాద్ లో తమ సమీప బంధువుల ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే అక్కడకి వెళ్ళిన ఈ కుటుంబం ఆ కార్యక్రమంలో శాన్విత ఫోటోలు తీసి వాటిని ఫేస్ బుక్ లో పెట్టారు. ఇక ఈ చిన్నారి ఫోటోలను చూసిన దర్శకుడు యోగి, తన స్నేహితుడు సురేష్‌కు ఆ ఫొటోలను పంపించాడట. ఆ ఫోటోలను చూసిన సురేష్ తనకు నాలుగు సంవత్సరాల వయసులోనే మొదటి సినిమాలో అవకాశం ఇచ్చారు. ‘శ్రీకారం’, ‘ఖిలాడీ’ సినిమాల్లో చక్కటి పాత్రలు దక్కించుకున్న ఈ చిన్నారి ఇప్పుడు ‘కిన్నెరసాని’, ‘జెట్టి’, ‘సిగ్ధ’, ‘లోకం ఎలా ఉంది నాయనా’, ‘సలార్’, ‘గాలీవాన’ తదితర చిత్రాలలో నటిస్తోందట.ఇంత చిన్న వయసులోనే ఇన్ని సినిమాలలో నటిస్తోంది అంటే ఫ్యూచర్లో ఈమె ఎంతో గొప్ప స్థాయిలో ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం వ్యక్తం చేయాల్సిన పనిలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…