Featured

Chiranjeevi: ‘చిరిగిన బట్టలతో సురేఖ మెడలో మూడు ముళ్లు వేశా..’ చిరంజీవి కామెంట్స్ వైరల్!

Chiranjeevi: సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కెరియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన కంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎందరికో ఆదర్శంగా ఉన్నారని చెప్పవచ్చు.

Chiranjeevi: చిరిగిన బట్టలతో సురేఖ మెడలో మూడు ముళ్లు వేసిన మెగాస్టార్.. చిరంజీవి కామెంట్స్ వైరల్!

పునాదిరాళ్లు అనే సినిమాతో నటుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టిన చిరంజీవి ఇప్పటికీ నేటి తరం హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే అప్పట్లోనే చిరంజీవిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించిన నటుడు అల్లు రామలింగయ్య తన కూతురు మెగాస్టార్ చిరంజీవి 1980 ఫిబ్రవరి 20వ తేదీన వివాహం చేశారు.

Chiranjeevi: చిరిగిన బట్టలతో సురేఖ మెడలో మూడు ముళ్లు వేసిన మెగాస్టార్.. చిరంజీవి కామెంట్స్ వైరల్!

ఇలా వీరిద్దరికీ వివాహం నిశ్చయం చేసిన తర్వాత చాలామంది అల్లురామలింగయ్యకి తన కూతురిని చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయవద్దని చెప్పినప్పటికీ తనలో ఓ గొప్ప నటుడు దాగి ఉన్నాడని ఎప్పటికైనా తన మంచి గుర్తింపు పొందుతాడని భావించిన అల్లు రామలింగయ్య చిరంజీవి సురేఖల వివాహం జరిపించారు.

ఇదిలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మెగాస్టార్ తన పెళ్లి సమయంలో తాతయ్య ప్రేమ లీలలు అనే సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో నూతన్ ప్రసాద్ ఎంతో బిజీగా ఉండటం వల్ల ఆయన షెడ్యూల్ కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్నామని అయితే నిర్మాత షూటింగ్ పోస్ట్ ఫోన్ చేసి పెళ్లికి గ్యాప్ ఇచ్చారని ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

చొక్కా మార్చుకోమ్మని చెప్పిన సురేఖ…

ఇకపోతే పెళ్లి పీటలపై తాళి కట్టే సమయంలో నా చొక్కా చిరిగిపోయిందని ఇదే విషయాన్ని సురేఖ తనకు తెలియజేసి చొక్కా మార్చుకొమ్మని సూచించారు. ఆ సమయంలో చొక్కా చిరిగిపోతే తాళికట్టలేనా అంటూ చిరిగిన చొక్కాతోనే సురేఖ మెడలో మూడు ముళ్లు వేశానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లిలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago