లక్షణాలు లేకుండా ఉన్న బాదితుల్లో దీర్గకాలిక కరోనా ! వారే ఎక్కువగా !

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఎప్పటికప్పుడు రంగులు మారుస్తూ రోజుకో విధంగా మనిషి శరీరంపై దాడి చేస్తుంది. అందులో కొందరికి లక్షణాలు చూపిస్తే.. మరి కొందరు ఎటువంటి లక్షణాలు లేకుండానే ఈ వైరస్ బారిన పడుతున్నారు. అయతే తాజగా లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో ఐదోవంతు మంది దీర్ఘకాల కరోనాతో బాధపడుతున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది..

గత కొద్దిరోజులుగా ఈ విషయంపై పలు పరిశోధనలు చేస్తున్నారు అమెరికాకు చెందిన ఫెయిర్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ కంపనీ. ఈ నేపధ్యంలో గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది వరకు నమోదైన కరోనా కేసులను విశ్లేషించారు. ఈ క్రమంలో లక్షణాలు లేకుండా ఉన్న కరోనా బాధితుల్లో దీర్ఘకాల కరోనాను గుర్తించినట్లు వారు తెలిపారు. ఇక కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన నాలుగువారాల తర్వాత కూడా అటువంటి లక్షణాలు తగ్గకపోతే దాన్ని దీర్ఘకాల కరోనా అంటారు. అయితే వీటిలో ప్రధానంగా ఒంటి నొప్పులు, శ్వాస సంబంధ సమస్యలు, అధిక కొవ్వు, అధిక రక్తపోటు ఉన్నాయి. దీర్ఘకాల కొవిడ్‌ను గుర్తించిన బాధితుల్లో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారని పరిశోధకులు చెబుతున్నారు.