కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఎప్పటికప్పుడు రంగులు మారుస్తూ రోజుకో విధంగా మనిషి శరీరంపై దాడి చేస్తుంది. అందులో కొందరికి లక్షణాలు చూపిస్తే.. మరి కొందరు ఎటువంటి లక్షణాలు లేకుండానే ఈ వైరస్ బారిన పడుతున్నారు. అయతే తాజగా లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఐదోవంతు మంది దీర్ఘకాల కరోనాతో బాధపడుతున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది..
గత కొద్దిరోజులుగా ఈ విషయంపై పలు పరిశోధనలు చేస్తున్నారు అమెరికాకు చెందిన ఫెయిర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపనీ. ఈ నేపధ్యంలో గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది వరకు నమోదైన కరోనా కేసులను విశ్లేషించారు. ఈ క్రమంలో లక్షణాలు లేకుండా ఉన్న కరోనా బాధితుల్లో దీర్ఘకాల కరోనాను గుర్తించినట్లు వారు తెలిపారు. ఇక కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన నాలుగువారాల తర్వాత కూడా అటువంటి లక్షణాలు తగ్గకపోతే దాన్ని దీర్ఘకాల కరోనా అంటారు. అయితే వీటిలో ప్రధానంగా ఒంటి నొప్పులు, శ్వాస సంబంధ సమస్యలు, అధిక కొవ్వు, అధిక రక్తపోటు ఉన్నాయి. దీర్ఘకాల కొవిడ్‌ను గుర్తించిన బాధితుల్లో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…