ఈ పథకంలో చేరితే.. భార్యభర్తలకు నెలకు రూ.10 వేలు వస్తాయి..!

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అందులో రైతులకు ఉపయోగపడేవి ఉన్నాయి.. సామాన్యులకు ఉపయోగపడేవి కూడా ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉన్న పథకం గురించి ఇక్కడ తెలుసుకుందాం. దీనిలో జాయిన్ అయితే భార్యభర్తలకు ఇద్దరికీ నెలకు రూ.10 వేలు తీసుకోవచ్చు. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం. మనం తెలుసుకునే పథకం.. అటల్ పెన్షన్ యోజన.

ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. దీనిలో జాయిన్ అయిన తర్వాత నెలకు మన వయస్సును బట్టి డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత మనకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.5 వేలు లేదా అంతకంటే తక్కువగా పెన్షన్ రూపంలో వస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ అటల్ పెన్షన్ యోజనకు కనీస వయస్సుగా 18 ఏళ్లు.. గరిష్ట వయస్సుగా 40 ఏళ్లు నిర్ణయించారు.

బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ పథకంలో జాయిన్ అవ్వొచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్ ఉంటే అందులో ఈ సర్వీస్ అనే ఆప్షన్ కి వెళ్లి వివరాను నమోదు చేసుకోవచ్చు. ఇలా చేరిన సదరు వ్యక్తి అకౌంట్ నుంచి నెల నెలా డబ్బుల కట్ అవుతూ ఉంటాయి. 40ఏళ్ల వయస్సులో జాయిన్ అయిన వారు 60 ఏళ్లు వచ్చే వరకు కట్టాలి. 18 ఏళ్ల వయస్సులో జాయిన్ అయితే 20 ఏళ్లు వరుసగా కట్టాల్సి ఉంటుంది.

ఉదాహరణకు 18 ఏళ్ల వయసులో స్కీమ్‌లో రూ.5 వేల పెన్షన్ కోసం నెలకు రూ.210 చెల్లించాల్సి ఉంటుంది. రూ.1000కు అయితే రూ.42, రూ.2 వేలకు రూ.84, రూ.3 వేలకు రూ.126, రూ.4 వేలకు రూ.168 కట్టాలి. అదే 40 ఏళ్ల వయస్సులో చేరితే ఆ అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలా రూ.5 వేల పెన్షన్ కోసం జాయిన్ అయితే 60 ఏళ్లు నిండిన తర్వాత భార్యాభర్తలకు నెలకు రూ.10 వేలు తీసుకోవచ్చు.