కరోనా మహమ్మారి వ్యాధి ప్రజలపై విరుచుకుపడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మరణించారు. అందులో కొంతమంది వ్యాధి సోకిన వారిలో కొన్నిసమస్యల కారణంగా బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇదిలా ఉండగా.. వ్యాధి నిరోధక శక్తి ఉన్న వాళ్లు కరోనాతో పోరాడి.. ప్రాణాలను కాపాడుకోగలిగారు.
ప్రతీ మనిషికి ఇమ్యూనిటీ పవర్ ఉండాలని.. వైద్యులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. వినే వాళ్లు విన్నారు.. వినని వాళ్లు వినలేదు. మంచి ఆరోగ్యం కోసం పోషకాలు కలిగిన పదర్ధాలను కూడా తీసుకోవాలని అన్నారు. కానీ ప్రస్తుత పరిస్తితుల్లో ఆ ఇమ్యూనిటీ పవర్ కోసమే చాలామంది ప్రయత్నిస్తున్నారు.
దాని కోసం వివిధ రకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్ ను తింటున్నారు. అయితే పండ్లలో మనం ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా పెంచుకోవాలంటూ జామ పండు అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. నారింజలో ఉండే విటమిన్–సి కంటే కూడా జామలో ఉండే విటమిన్–సి ఎక్కువగా ఉంటుంది.
అందుకే జామపండు ఎన్నెన్నో వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంతో పాటు ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా ఉపయోగిస్తారు. విటమిన్ సి అంటేనే వ్యాధి నిరోదక శక్తి ఎక్కువగా ఉండేది. జామలో దానితో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దీని ద్వారా మలబద్దకం కూడా తేలికగా నివారించవచ్చు. ఇలాంటి ఎన్నో గుణాలు ఉన్న జామను ఎక్కువగా చాలామంది ఇష్టపడుతుంటారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…