2019 లో జరిగిన సాధారణ ఎన్నికలకు ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను సీఎం అయిన తర్వాత మద్యపానాన్ని విడతల వారీగా నిషేదిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2019 లో అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని.. మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక సీట్లతో అతడు తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వచ్చాడు.
మద్యం విషయంలో కూడా నిషేదాన్ని విడతల వారీగా అమలు పరుచుకుంటూ వచ్చాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ సంవత్సరం మద్యం దుకాణాలను తగ్గించడం లేదంటూ.. మద్యం ప్రియులకు శుభవార్త చెప్పాడు. అంతక ముందు ఉన్న మద్యం దుకాణాలనే పొడిగిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో కొంతమంది ఖుషీగా ఫీల్ అవుతుంటే మరికొంత మంది దీని వెనకాల ఏదో జరుగుతుందంటూ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా.. గత ఏడాది ఇదే సమయంలో మద్యం ధరలను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం కూడా అవే ధరలు కొనసాగనున్నట్లు సమాచారం. మీడియం, ప్రీమియం బ్రాండ్ ధరలను సుమారు 25 శాతం తగ్గించిన విషయం తెలిసిందే. బీరు, రెడీ టూ డ్రింక్ మద్యం ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం కూడా మద్యం దుకాణాలను తగ్గించడం లేదు కావునా.. ధరలు కూడా అలానే ఉంటాయని ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…