బండ్లన్న మనస్సు గొప్పది.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. కారణం ఇదే..

తెలుగు సనీ పరిశ్రమలో ఒక కమెడియన్ గా కెరీర్ ను మొదలు పెట్టి.. స్టార్ ప్రొడ్యూసర్ అయిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకునేది బండ్ల గణేష్. అతడు పవన్ కళ్యాన్ సినిమాల్లో ఎక్కువగా ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తూ.. కామెడీని పండిస్తూ అలరించాడు. తర్వాత సినిమాలకు ప్రొడ్యూసర్ గా పని చేశాడు.

ప్రస్తుతం కూడా ఎన్నో సినిమాలు ఆయన నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్నాయి. అంతే కాకుండా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కమెడియన్ గా మెరుస్తున్నారు. అతడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అతడు పెట్టె పోస్టులు ఒకానొక సమయంలో వైరల్ గా మారి.. వివాదాలకు కూడా దారితీస్తుంటాయి. తాజాగా బండ్ల గణేష్ మనస్సు మంచిది అంటూ నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.

దానికి గల కారణం ఏంటంటే.. అతడు ఓ చిన్నారిని దత్తత తీసుకున్నాడు. దీంతో అతడు చేసిన పనిని ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఇటీవల అతడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. నేపాలీ పాపను అతడు పెంచుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ప్రతీ ఒక్కరి అభిరుచి వివిధ రకాలుగా ఉంటుంది.. కొంత మంది కుక్కలను, పిల్లులను పెంచుకుంటారు. వాటిని పెంచుకోగా లేనిది.. తాను పాపను పెంచుకుంటే తప్పేంటి అంటూ చెప్పుకొచ్చాడు.

కనీసం పాపకు సరైన పోషకాహారం కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న కుటుంబం నుంచి ఆ పాపను దత్తత తీసుకున్నట్టు బండ్ల గణేశ్ వెల్లడించారు. పాప ఏడుస్తున్న సమయంలో ఆమె తల్లి ఏమీ ఏమీ లేకపోవడంతో కేవలం పాలు పడుతున్న పరిస్థితిని తన భార్య గమనించిందని.. భార్య సూచన మేరకు ఆ పాపను తమ ఇంటికి తీసుకువచ్చామని వివరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాల పోస్టు చేశాడు. అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.