బెంజమిన్ బటన్ వ్యాధి అంటే ఏమిటి.. దీని లక్షణాలు ఎలా ఉంటాయి?

ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్క ప్రాణి ఏదో ఒక రోజు మరణించాల్సిందే. అయితే ఆ మరణం మనకు ఎప్పుడో ఒక రోజు వస్తుంది అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. కానీ పలు వ్యాధి కారణంగా మనం చనిపోతామని తెలిస్తే ఆ బాధ వర్ణించలేనిది. అలాంటి బాధనే అనుభవిస్తూ.. చివరికి మృత్యుఒడికి చేరుకుంది పద్దెనిమిదేళ్ల అశాంతి స్మిత. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. అందరిచేత కన్నీరు పెట్టిస్తోంది. ఇంతకీ ఆమె ఏ వ్యాధితో మరణించింది… వ్యాధి లక్షణాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

యూకే వెస్ట్‌ సస్సెక్స్‌కు చెందిన 18 ఎలా అశాంతి స్మిత జూలై 17న తుది శ్వాస విడిచారు. అశాంతి పుట్టిన 8 సంవత్సరాల వయసు నుంచి ఒక వింతైన జబ్బుతో బాధ పడుతుంది.ఇదొక జెనెటిక్‌ డిసీజ్‌. ఈ సిండ్రోమ్‌ ఉన్నవాళ్లకు చిన్నవయసులో వయసు పైబడిన వారి లక్షణాలు కనిపిస్తాయి. ఈ క్రమంలోనే స్మిత తన 8 వ సంవత్సరంలో ఈ వ్యాధి బారిన పడింది.

ఈ క్రమంలోనే ప్రతిఏటా ఆమెకు ఎనిమిది రెట్లు వయసు పెరుగుతూ వస్తోంది.ఈ విధమైనటువంటి జన్యుపరమైన వ్యాధితో బాధ పడుతూ చివరికి తుది శ్వాస విడిచింది.అశాంతి స్మితలో ఈ విధమైనటువంటి జన్యుపరమైన వ్యాధి వచ్చినప్పటికీ ఆత్మస్థైర్యంతో ఉండాలని, ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేది. తన గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా ఎంతో సంతోషంతో ఉండేది.ఆమెకు బీటీఎస్‌ సంగీతం అంటే ఎంతో ఇష్టమని..తన అంత్యక్రియలను అదే సంగీతం తోనే ముగిస్తామని స్మిత తల్లి తెలిపారు.

ఈ విధమైనటువంటి వింత వ్యాధిని ప్రొగేరియా ఒక జెనెటిక్‌ డిసీజ్‌. డిఎన్ఎలో విపరీతమైన మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఈ విధమైనటువంటి శరీరంలో మార్పులు చోటు చేసుకుంటూ చర్మంపై ముడతలు పడటం జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలు కనబడతాయి. కేవలం జెనిటిక్ పరీక్షల ఆధారంగా మాత్రమే ఈ వ్యాధిని గుర్తించగలం. ఈ వ్యాధికి చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఒకసారి ఈ వ్యాధి బారిన పడ్డామంటే కోలుకోవడం చాలా అరుదు. అదేవిధంగా ఈ వ్యాధితో బాధపడే వారు దాదాపు 90 శాతం మందికి స్ట్రోక్స్ వచ్చే మరణించారు.బ్రాడ్‌ పిట్‌ నటించిన ‘ది క్యూరియస్‌ కేస్‌ ఆఫ్‌ బెంజమిన్‌ బటన్‌’అనే సినిమాను ఈ కథాంశంతో తెరకెక్కినది కావడంతో ఈ వ్యాధికి బెంజమిన్‌ బటన్‌ అనే పేరు వచ్చింది.