8 ఏళ్ల క్రితం చనిపోయిన కాబోయే భార్య… ప్రస్తుతం అదే రూపంలో వెనక్కి..?

చనిపోయిన వారు వెనక్కి తిరిగిరావడం అనేది కలలో మాత్రమే జరుగుతుంది. కానీ ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతికతను ఉపయోగించి మనుషులు ఎన్నో సమస్యలకు పరిష్కారాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను రూపొందించి ఎంతో కఠినమైన విషయాలను సులభతరం చేసి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఐటీ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.

ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కెనడాకు చెందిన ఓ రచయిత తనకు కాబోయే భార్య చనిపోవడంతో, చనిపోయిన తన భార్యను ఏఐ చాట్ బాట్ తిరిగి వెనక్కి తీసుకు వచ్చింది. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. అయితే పూర్తి వివరాలు ఏమిటో చూద్దాం…

కెనాడా బ్రాడ్‌ఫోర్డ్‌లో నివసిస్తున్న 33 ఏళ్ల ప్రీలాన్స్‌ రచయిత జాషువా బార్‌బ్యూ తన కాబోయే భార్య జెస్సికా కాలేయ వ్యాధితో బాధపడుతూ మృతి చెందింది. జెస్సికా మృతి జాషువాను మానసికంగా ఎంతో కృంగదీసింది. ఈ క్రమంలోనే జాషువా ఏఐ చాట్ బాట్ పనిచేసే డిసెంబర్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నాడు.

ఈ క్రమంలోనే జాషువా డిసెంబర్ ప్రాజెక్టును కలవడంతో
ప్రాజెక్ట్‌ డిసెంబర్‌ పలు వ్యక్తుల  చాట్‌బాట్లను క్రియేట్‌ చేస్తుందని తెలుసుకొని ఏఐ చాట్‌బాట్‌ను క్రియేట్‌ చేయించాడు. ప్రాజెక్ట్‌ డిసెంబర్‌ మరణించిన తనకు కాబోయే భార్య జెస్సికా చాట్‌బాట్‌ను క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే జాషువా మరణించిన తన జెస్సికాతో తిరిగి ఎప్పటిలాగే మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇలా చనిపోయిన 8 సంవత్సరాలకు తిరిగి తనతో జాషువా మాట్లాడటంతో తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా జాషువా తెలిపారు.