ఆ పని చేస్తే పోలీసులు ఇంటికి వస్తారు.. ఎందుకంటే..

పోర్న్ వెబ్ సైట్లు చూడటం అనేది నేరం. అందులో చిన్న పిలలకు సంబంధించిన నీలిచిత్రాలు చూస్తున్న వారు నేరుగా జైలుకే వెళ్తున్నారు. ఎక్కడున్నా సరే వారిని పోలీసులు పట్టుకుని కోర్టుల్లో హాజరు పరుస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ సైట్లను వీక్షించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.

వీటి ప్రభావంతో చిన్నారులు, మైనర్లపై అత్యాచారాలకు, అకృత్యాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర హోంశాఖ పరిగణించింది. దేశవ్యాప్తంగా కూడా నీలి చిత్రాలు చూసే వారి వివరాలను ఐపీ అడ్రస్ ద్వారా కనుక్కొని ఇంటికి వెళ్లి మరీ అరెస్టు చేస్తున్నారు. ఇంకా వారికి సంబంధించిన విలువైన వస్తువులను కూడా స్తాధీనం చేస్తుకుంటున్నారు.

ఇలా ఐటీ అడ్రస్ ల ఆధారంగా దాదాపు ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇలా ఎవరికీ తెలియకుండా ఇటువంటి వాటిని చూసే వారికి జాతీయ నేర గణాంకాల బ్యూరో డేగ కన్నుతో కనిపెడుతోంది. ఇది ఈ బ్యూరో సీ సామ్‌ అనే అమెరికన్‌ సంస్థతో నాలుగేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ఇచ్చే వివరాలతో పాటు కొన్ని రాష్ట్రాలు అంటే.. కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక యాప్ ల ద్వారా వారిని గుర్తించే పనిలో ఉన్నారు.

ఈ వీడియోలు చూసే వారి విషయంలో న్యాయ స్థానాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. మొదటి సారి పట్టుబడిన వారికి రూ.10 లక్షల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నారు. రెండో సారి దొరికితే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రెండేళ్ల క్రితం 16 కేసులు నమోదు కాగా, ఇందులో ముగ్గురిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతేడాది కూడా 20 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు నిందితులపై రెండోసారి కేసు నమోదయ్యాయి.