ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది. ఏ తేదీన, ఏ సమయాన ఎన్నికలు నిర్వహిస్తారనే విషయాలను ప్రకటించారు. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు.
అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. సెప్టెంబరు 27 నుంచి సెప్టెంబర్ 29 వరకు అంటే మూడు రోజులు నామినేషన్లను స్వీకరించి 30న వాటిని పరిశీలిస్తామని కృష్ణమోహన్ వివరించారు.
వాటి ఉపసంహరణకు అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఉపసంహరణకు అవకాశం ఉండగా.. తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ పోటీల్లో నిలిచే అభ్యర్థులు ఒక పోస్టుకు ఒక్కరు మాత్రమే పోటీ చేయాలని తెలిపారు. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారని తెలిపారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నామినేషన్లు వేయాలని సూచించారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్, ప్రకాష్ రాజ్, సీవీఎల్ నర్సింహరావు ఉన్నారు. దీనిలో గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి.. 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్‌లకు హాజరు కాకపోతే పోటీ చేసే అర్హత ఉండదని పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…