KGF2′ లో మరో స్పెషల్ సాంగ్.. యశ్ తో అదిరిపోయే స్టెప్పులేయనున్న బాలీవుడ్ హీరోయిన్లు..!!

‘KGF’ అనే ఒక కన్నడ సినిమా యావత్ అన్ని భాషల్లో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కన్నడ హీరో యశ్ ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు..అయితే ఈ సినిమాకు సిక్వెల్ గా తీస్తున్న కేజీఎఫ్ 2 షూటింగ్ ఇప్పటికే చివరిదశకు చేరుకున్న క్రమంలో.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ఫస్ట్ చాప్టర్ భారీ హిట్ సాధించడంతో.. ఈ సీక్వెల్ పై పెద్ద ఎత్తున అంచనాలున్నాయి.పాన్ ఇండియా లెవెల్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ పోస్టర్స్, టీజర్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది.

ఇక ఈ సినిమాలో శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా చేస్తుండగా..ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేజీఎఫ్‌ ఫస్ట్ చాప్టర్ లో మిల్కీ బ్యూటీ తమన్నాతో ఓ ఐటెమ్ సాంగ్ చేయించిన సంగతి తెలిసిందే. ఈ ట్యూన్ అండ్ లిరిక్ కూడా అప్పటి కాలానికి అనుగుణంగా ఉండేలా చూసుకున్నారు మేకర్స్. ఇక సిచువేషన్ కు కూడా సింక్ కావడంతో..ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. తాజాగా సెకండ్ చాప్టర్ లో కూడా ఐటెమ్ సాంగ్ ఉండేలా కథను డిజైన్ చేశారట డైరెక్టర్.

సౌత్ అండ్ నార్త్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ పాటను కంపోజ్ చేస్తున్నారట. ఈ సాంగ్ కోసం ఇప్పటికే బాలీవుడ్ హాట్ బ్యూటీస్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహి సంప్రదించారని సమాచారం. అయితే ఆ ఇద్దరిలో ఒకరిని ఫైనలైజ్ చేస్తారని చేస్తారని.. ఇందుకు సంబంధించిన పనులు ప్రాసెస్ లో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది..ఇక జూలై నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా పడే అవకాశం ఉంది..!!