వరుడు గుట్కా నమిలాడని.. పెళ్లి ఆపేసిన వధువు?

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో గొప్ప వేడుక. ఈ పెళ్లి బంధం ద్వారా రెండు జీవితాలు ఒక్కటై పదికాలాలపాటు పచ్చగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ క్రమంలోనే మన జీవితంలోకి స్వాగతించే వ్యక్తి ఎంతో గొప్పగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే పెద్దలు కుదిర్చిన పెళ్లి వల్ల కొందరు మనస్తత్వాలు ముందుగా మనకు తెలియవు. ఇలాంటి సమయంలోనే కొందరు పెళ్లిళ్లు చేసుకుని జీవితాంతం ఎంతో నరకయాతన అనుభవిస్తుంటారు. కానీ తన జీవితంలోకి రాబోయే వ్యక్తి గురించి ఏవైనా లోపాలు ఉన్నాయని తెలిస్తే కొందరు ఎంతో ధైర్యం చేసి కరాఖండిగా ఈ పెళ్లి చేసుకోనని అని చెప్పేస్తారు. ఇలాంటి కోవకు చెందినదే ఉత్తర ప్రదేశ్ కి చెందిన ఒక యువతి. తనకు కాబోయే వరుడు గుట్కా నములుతున్నాడన్న కారణంతో పెళ్లిని వాయిదా వేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాలియా జిల్లాలో మిస్రౌలీ గ్రామానికి చెందిన ఓ యువతికి కెజురీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పెళ్లి కుదిరింది. ఈ క్రమంలోనే వీరి వివాహాన్ని జూన్ 5వ తేదీన జరిపించాలని పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కొంత సమయంలో మూడుముళ్ల బంధం ద్వారా ఒక్కటవుతారని భావించిన ఈ జంట శాశ్వతంగా విడిపోయారు.

వరుడికి గుట్కా నమలడం వ్యసనంగా మారింది. అయితే ఈ విషయాన్ని దాచి పెళ్లి జరిపిస్తున్నారు. ఈ క్రమంలోనే పెళ్లికి కొన్ని గంటల సమయం ముందు గుట్కా నమలడం చూసిన వధువు ఈ పెళ్లిని ఆపాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఈ పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పడంతో పెళ్లికి వచ్చిన అతిథులు ఒక్కసారిగా ఎంతో ఆశ్చర్యపోయారు.

వరుడికి గుట్కా నమలడం అలవాటు ఉందని,ఆ విషయాన్ని దాచి పెళ్లి చేస్తుండడంతో ఎంతో ఆగ్రహం చెందిన వధువు ఈ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. ఇరు కుటుంబాల పెద్దలు ఎంత నచ్చచెప్పినప్పటికీ ఈమె తన నిర్ణయం మార్చుకోక పోవడంతో కుటుంబ పెద్దలు పెళ్లిని రద్దు చేసుకున్నారు.ఈ క్రమంలోనే పెళ్లికోసం వధువు కుటుంబం నుంచి తీసుకున్న కట్నకానుకల వరుడు కుటుంబ సభ్యులు తిరిగి ఇచ్చేశారు.