రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఎకరాకు 7 వేల రూపాయలు..?

ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం సరికొత్త బడ్జెట్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొత్త వ్యవసాయ చట్టాలను అమలు చేయడంతో మోదీ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది.

రైతుల ధర్నా వల్ల మోదీ సర్కార్ కు చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు ఏర్పడటంతో కేంద్రం రైతులను ప్రసన్నం చేసుకునేందుకు బడ్జెట్ లో కీలక ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. రైతులను బడ్జెట్ ద్వారా ఆదుకోవాలని కేంద్రం భావిస్తోందని.. పీఎం కిసాన్ స్కీమ్ నగదు పెంపుతో పాటు సోలార్ పంపు స్కీమ్ గడువును కూడా పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

పీఎం కుసుమ్ స్కీమ్ కొరకు రెన్యూవబుల్ మినిస్ట్రీ గతంతో పోలిస్తే ఎక్కువగా నిధులను కేటాయించిందని.. ఎకరాకు 7 వేల రూపాయల చొప్పున కేంద్రం పీఎం కుసుమ్ స్కీమ్ కు దరఖాస్తు చేసుకున్న వారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పీఎం కుసుమ్ యోజన స్కీమ్ ద్వారా రైతులు సోలార్ ప్యానెల్స్ ను సబ్సిడీ ధరకే పొందే అవకాశం ఉంటుంది. సోలార్ ప్యానెల్స్ ను కొనుగోలు చేయడం ద్వారా రైతులు సొంతంగా ఎలక్ట్రిసిటీ తయారు చేసుకోవచ్చు.

సోలార్ ప్యానెల్స్ ను అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు అదనపు విద్యుత్ ను విక్రయించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 20 లక్షల మంది రైతులు పీఎం కుసుమ్ యోజన స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకొని ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలను పొందుతుండటం గమనార్హం. కేంద్రం బడ్జెట్ లో క్రాప్ డైవర్సిఫికేషన్ స్కీమ్ ను అమలులోకి తెచ్చి ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఎకరాకు 7 వేల రూపాయల చొప్పున ఇవ్వనుందని తెలుస్తోంది.