Case On Fish: ఇదేందయ్యా సామి...చేపపై కేసు నమోదు..! ఎందుకో తెలుసా..?

Case On Fish: ఇదేందయ్యా సామి…చేపపై కేసు నమోదు..! ఎందుకో తెలుసా..?

Case On Fish: ఆంధ్రప్రదేశ్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వేటకు వెళ్లిన మత్స్యకారుడిని చేప చంపేసింది. వినడానికి వింతగా ఇన్నా ఇదే నిజం. ఈ చేపపై పోలీసులు కేసు కూడా పెట్టడం మరో సంచలనంగా మారింది. ఏన్నో ఏళ్లుగా వేటకు వెళ్తున్న ఇటువంటి సంఘటన ఎదురుకాలేదని మత్స్యకారులు చెబుతున్నారు.

Case On Fish: ఇదేందయ్యా సామి...చేపపై కేసు నమోదు..! ఎందుకో తెలుసా..?
Case On Fish: ఇదేందయ్యా సామి…చేపపై కేసు నమోదు..! ఎందుకో తెలుసా..?

ఈ ఘటన విశాఖ సముద్ర తీరంలో చోటు చేసుకుంది. సముద్రంలో ఉండే కొమ్ము చేప మహా డేంజరెస్. అలాంటి చేప దాడిలోనే మత్స్యకారుడు మరణించాడు. ఈ చేపపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎటాంటి చర్య తీసుకుంటారో అని ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం చేపపై హత్యా నేరం నమోదు చేశారు విశాఖ పరవాడ పోలీసులు. 

Case On Fish: ఇదేందయ్యా సామి…చేపపై కేసు నమోదు..! ఎందుకో తెలుసా..?

మనుషులపై దాడి చేసి తన పదునై కమ్ముతో చంపేయడం కొమ్ము చేప ప్రత్యేకత. ఇది విశాఖకు దాదాపు ఎనబై నాటికల్ మైళ్ల దూరంలోనే ఈ కొమ్ము చేపలు నివాసం ఏర్పాటు చేసుకున్నాయనే వార్తలు ప్రస్తుతం మత్స్యకారులను కలవరపెడుతోంది. 


జోగన్న అక్కడే మరణించాడని..

అయితే ఈ ఘటన ఎలా జరిగిందనేదానిపై వేటకు వెళ్లిన మిగతా మత్స్యకారులు  వివరాలు వెల్లడించారు. విశాఖ పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెంకు చెందిన ఐదుగురు మత్య్యకారులు చేపల వేటకు వెళ్లారు. తీరం నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చేపల కోసం వల వేశారు. మరసటి రోజు ఉదయం 8 గంటలకు వలలో పెద్దచేపలు చిక్కాయి. ఆ సమయంలో వలను పైకి లాగే ప్రయత్నం చేశారు. బరువు చాలా ఎక్కువగా ఉండటంతో మత్య్సకారులకు కష్టమైంది. ఈ సమయంలోనే వల పడవకు చిక్కుకుంటే చిరిగే అవకాశం ఉండటంతో జోగన్న అనే మత్స్యకారుడు నీటిలోకి దిగాడు. ఈ సమయంలోనే కొమ్ముకోనెం చేప జొగన్న డొక్కలో తన ముక్కుతో పొడించింది. తీవ్రగాయం అయిన జోగన్న అక్కడే మరణించాడని తోటి మత్స్యకారులు తెలిపారు. ఈ ఘటనను విచారించిన పోలీసులు.. తోటి మత్స్యకారులను కూడా విచారించి కోమ్ముకోనెం చేపే జోగన్నను చంపిందని నిర్థారణకు వచ్చారు. చేపపై కేసు నమోదుచేశారు. జోగన్న మృతదేహాన్ని అనకాపల్లి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వ హించారు. మత్య్సకారులతో మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస రావు సమావేశం నిర్వహించారు. కనీసం రక్షణ లేకుండా సముద్రంలోకి ఎలా వెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.