చిన్నారులకు కరోనా వైరస్ టీకాలు.. ఎప్పటినుండంటే?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ దేశాలన్ని వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. ఈ క్రమంలోనే మన దేశంలో 18 సంవత్సరాలు 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ గత ఏడాదిన్నర కాలం నుంచి ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది మరణించారు. ఈ క్రమంలోనే రెండవ దశ మన దేశంలో తీవ్ర రూపం దాలుస్తూ అల్లకల్లోలం సృష్టించింది.ఈ క్రమంలోనే 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.

ఇప్పటికే రెండు దశలలో వ్యాప్తిచెందిన కరోనా వైరస్ తర్వాత మూడవ దశ చిన్న పిల్లలపై అధిక ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నా సమయంలో ఇప్పటికే అన్ని దేశాల ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తమయ్యాయి. అదేవిధంగా చిన్నపిల్లలో ఈ వైరస్ ను కట్టడి చేయడం కోసం త్వరలోనే వీరికి టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించనున్నాయి.

చిన్న పిల్లలలో వ్యాక్సిన్ కనుగొనడానికి ఇప్పటికే మోడెర్నా వ్యాక్సిన్‌తో పాటు మరో ప్రొటీన్‌ ఆధారిత టీకా ఈ మేరకు ప్రాథమిక ప్రయోగాల్లో సత్ఫలితాలనిచ్చినట్లు అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు.ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు 16 కోతి పిల్లలను రెండు బృందాలుగా విడదీసి వాటిలో ఒక బృందానికి మోడెర్నా, మరో వర్గానికి ప్రొటీన్‌ ఆధారిత టీకా అందించారు.  ఈ విధంగా కోతిపిల్లలలో రెండు డోసులు అందించాక ఆ కోతులలో కొవిడ్‌ కారక ‘సార్స్‌-కొవ్‌-2’ వైరస్‌ను అంతమొందించగల సురక్షిత, బలమైన యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయనీ నిపుణులు తెలియజేశారు.

పెద్ద కోతులలో 100 మైక్రోగ్రాముల టీకా డోసుతో వచ్చిన యాంటీబాడీలు.. చిన్న కోతుల్లో కేవలం 30 మైక్రోగ్రాముల డోసుతోనే ఉత్పత్తయ్యాయి. అదేవిధంగా
మోడెర్నా వ్యాక్సిన్ అందించిన కోతులలో అధిక మొత్తంలో వ్యాధి తీవ్రతను తగ్గించే  టీ-సెల్‌ ఉత్పత్తి అయినట్లు ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ క్రిస్టీనా డి పార్‌ తెలిపారు. ఈ విధంగా కూతులలో జరిపిన ప్రయోగాలు సత్ఫలితాలను ఇవ్వడంతో త్వరలోనే ఈ వ్యాక్సిన్ ఈ విషయంలో మరింత లోతుగా అధ్యయనాలు జరిపి త్వరలోనే పిల్లలపై ప్రయోగాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.