గర్భంతో ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే ఏం జరుగుతుంది.. బిడ్డకు ప్రమాదమా?

ప్రపంచవ్యాప్తంగా ఏడాదిన్నర పాటు అన్ని దేశాలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి మార్కెట్లోకి వ్యాక్సిన్ ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఈ వ్యాక్సిన్ 45 సంవత్సరాలు పైబడిన వారికి, ఫ్రంట్లైన్ వారియర్స్కు ఇవ్వడం జరిగింది.

తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు పైబడిన వారి అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గర్భం దాల్చిన మహిళలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి? అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి.అయితే గర్భిణీ స్త్రీలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

వ్యాక్సిన్ కనుగొన్న సమయంలో అన్ని వయసుల వారి పై క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. కానీ గర్భిణీ స్త్రీలలో మాత్రం ట్రయల్స్ నిర్వహించలేదు కనక ఈ వ్యాక్సిన్ ప్రభావం గర్భం దాల్చిన మహిళలు, కడుపులో బిడ్డ పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనేది కచ్చితంగా తెలియకపోయినప్పటికీ, కరోనా బారిన పడినప్పుడు కలిగే దుష్ప్రభావాలు కన్నా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కలిగే దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

సాధారణంగా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు తేలికపాటి దుష్ప్రభావాలు కలుగుతాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు సర్వసాధారణం. వ్యాక్సిన్ తీసుకోవటంవల్ల మన శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఈ యాంటీ బాడీస్ పిండంలో కూడా పెరగడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు.

మొదటి దశ పోలిస్తే రెండవ దశలో ఎక్కువ భాగము గర్భిణీ స్త్రీలు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. అయితే ఈ వైరస్ ను ముందుగా గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం సంభవించిందని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే సీడీసీ, ఎఫ్‌డీఏ, ఏ సీఓజీ, ఆర్‌సీఓజీ, ఎఫ్‌ఓజీఎస్‌ఐ వంటి సంస్థలు గర్భందాల్చిన మహిళలు కూడా కరోనా వ్యాక్సిన్‌ను తీసుకోవడం మంచిదని సూచనలు ఇస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న కూడా మాస్కు ధరించి, తరచూ చేతులు శుభ్రంగా కడగడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తల ద్వారా వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.