దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో తమిళనాడులో కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలోనే తమిళనాడులోని కోయంబత్తూరులో మాత్రం ఈ మహమ్మారిని అంతం చేయడం కోసం అక్కడి ప్రజలు కరోనా దేవతను ఏర్పాటు చేశారు. అక్కడి ప్రజలు కరోనా దేవతా విగ్రహాన్ని ప్రతిష్టించి 48 రోజులపాటు భక్తిశ్రద్ధలతో హోమాలు నిర్వహించాలని భావించారు. ఈ విధంగా కరోనా దేవతకు పూజలు చేయటం వల్ల ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కోయంబత్తూరులోని ప్రజలు కరోనా దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా దేవతకు సంబంధించినటువంటి ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటో చూసిన నెటిజన్లు అందరూ తమ క్రియేటివిటీని బయట పెడుతున్నారు.కరోనా దేవత ఫోటో చూసిన నెటిజన్లు కరోనా దేవత అచ్చం సినీనటి విజయ్ కుమార్ పోలికలతో ఉందని మీమ్స్ తయారు చేసి కామెంట్లు పెడుతున్నారు.
ఈ క్రమంలోనే సినీనటి వనిత విజయ్ కుమార్ స్పందిస్తూ.. “ఓరి దేవుడా! ఇదేంటి ప్రతి ఒక్కరు ఈ ఫోటో తో పాటు మీమ్స్ పంపుతున్నారు” అంటూ నెటిజన్లు చేసే కామెంట్లపై వనిత విజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.ప్రస్తుతం కరోనా దేవతకు సంబంధించినటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…