కరోనా దేవి నీలానే ఉందంటూ ఆ నటిపై కామెంట్స్.. ఆమె ఏం చేసిందంటే?

0
255

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో తమిళనాడులో కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే తమిళనాడులోని కోయంబత్తూరులో మాత్రం ఈ మహమ్మారిని అంతం చేయడం కోసం అక్కడి ప్రజలు కరోనా దేవతను ఏర్పాటు చేశారు. అక్కడి ప్రజలు కరోనా దేవతా విగ్రహాన్ని ప్రతిష్టించి 48 రోజులపాటు భక్తిశ్రద్ధలతో హోమాలు నిర్వహించాలని భావించారు. ఈ విధంగా కరోనా దేవతకు పూజలు చేయటం వల్ల ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కోయంబత్తూరులోని ప్రజలు కరోనా దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా దేవతకు సంబంధించినటువంటి ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటో చూసిన నెటిజన్లు అందరూ తమ క్రియేటివిటీని బయట పెడుతున్నారు.కరోనా దేవత ఫోటో చూసిన నెటిజన్లు కరోనా దేవత అచ్చం సినీనటి విజయ్ కుమార్ పోలికలతో ఉందని మీమ్స్ త‌యారు చేసి కామెంట్లు పెడుతున్నారు.

ఈ క్రమంలోనే సినీనటి వనిత విజయ్ కుమార్ స్పందిస్తూ.. “ఓరి దేవుడా! ఇదేంటి ప్రతి ఒక్కరు ఈ ఫోటో తో పాటు మీమ్స్ పంపుతున్నారు” అంటూ నెటిజన్లు చేసే కామెంట్లపై వనిత విజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.ప్రస్తుతం కరోనా దేవతకు సంబంధించినటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here