మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ “ఇడియట్” సినిమా.. డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఈ చిత్రంతో హీరోగా రవితేజ, డైరెక్టర్ గా పూరి జగన్నాద్ లకు ఎంత పేరు వచ్చిందో.. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ రక్షిత కు కూడా అంతే క్రేజ్ వచ్చింది. ఆమెకు తెలుగులో ఇది తోలి చిత్రం. నటించిన తొలి చిత్రంతోనే ప్రేక్షకులను తన అందంతో, నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో మరికొందరు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా వచ్చింది. చిరంజీవి సరసన “గోవిందుడు అందరివాడు” చిత్రంలో, నాగార్జున తో “శివమణి”, మహేష్ బాబు కి జతగా “నిజం”, ఎన్టీఆర్ “ఆంధ్రావాలా” వంటి సినిమాలతో స్టార్ హీరోల సరసన నటించింది రక్షిత. ఆ సమయంలో రక్షిత క్రేజ్ మామూలుగా లేదు. కొన్ని సినిమాలకు ఆమె కోసం మాత్రమే వెళ్లిన అభిమానులు కూడా ఉన్నారు. అప్పట్లో కుర్ర కారుని ఒక ఊపేసింది రక్షిత. తన అందంతో అలా కట్టిపడేసేది ఆమె.

అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే కన్నడ దర్శకుడు ప్రేమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రక్షిత. 2007 లో వీరి వివాహం జరిగిన తరువాత ఆమె సినిమాల్లో నటించలేదు. పెళ్లి తరువాత రక్షిత సినిమాల వైపు చూడలేదు. మెల్ల మెల్లగా ఆమె ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. ప్రస్తుతం కొన్ని కన్నడ టీవీ షో లలో జడ్జి గా వస్తున్నారు రక్షిత. ఇప్పుడు ఆమెను చుసిన వారు మాత్రం షాక్ అవుతున్నారు. ఇడియట్ సినిమాలో హీరోయిన్ గా మంచి స్ట్రక్చర్ మెయింటైన్ చేసిన రక్షిత ఇప్పుడు బాగా లావుగా కనిపిస్తున్నారు.

ఆమెతో పాటు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అప్పటి హీరోయిన్లు ఇండస్ట్రీలో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వెలుగుతున్నారు అయితే తాను మాత్రం వెండితెరపై కనిపించానని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు రక్షిత. బహుశా అందువల్లే అనుకుంట ఆమె ఫిజిక్ పై పెద్దగా శ్రద్ద పెట్టడంలేదు. వాలెంటైన్స్ డే సందర్భంగా జరిగిన షోలో ఆమె భర్తతో కలిసి దిగిన ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. ఈ ఫోటోలు రక్షితను చుసిన తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇడియట్ సినిమాలో రక్షిత గుర్తున్నవారు ఇప్పుడు చుసిన రక్షిత ఇలా చూసి చాలా షాక్ అవుతున్నారు. అసలు ఈమె ఇడియట్ సినిమా హీరోయిన్ ఏనా అనిపిస్తుంది. ఎందుకంటే రక్షిత చాలా లావుగా ఉన్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here