సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా అడుగుపెట్టి… తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుని టాలీవుడ్ సూపర్ స్టార్ గా వెలుగుతున్న మహేష్ బాబు. “భరత్ అనే నేను”, “మహర్షి”, సంక్రాంతికి రిలీజ్ అయిన “సరిలేరు నీకెవ్వరు”తో బ్లాక్ బస్టర్ ఫామ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు. “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు వసూలు చేసారు. తన సినిమాల విషయంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్ట్రెటజీ ఫోలో అవుతుంటారు మహేష్. సినిమాల ఎంపికలోనే కాదు, ఆ సినిమాల ప్రమోషన్స్ లో కూడా తాను ప్రముఖ పాత్ర వహిస్తారు. ప్రస్తుతం మహేష్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ నంబర్ వన్ నేనే అంటూ తన సినిమాలతో సమాధానం ఇస్తున్నాడు. దీనిపై ఫాన్స్ యమా ఖుషీలో ఉన్నారు.

సినిమా అయిపోయిన తరువాత ఫామిలీ తో కలిసి హాలిడే ట్రిప్ కి వెళ్లే అలవాటున్న మహేష్ ప్రస్తుతం విదేశాల్లో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు.. దీనికి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే మహేష్ “సరిలేరు నీకెవ్వరు” తో పాటు… త్రివిక్రమ్, అల్లు అర్జున్ ల కలయికలో వచ్చిన మరో సినిమా “ఆలా వైకుంఠపురములో..” కూడా అద్భుత విజయాన్ని అందుకుంది. టాలీవుడ్ లో అరుదైన 300 కోట్ల క్లబ్ వైపు దూసుకుంటూ పోతోంది.

అమెరికాలోని హాలిడే ట్రిప్ లో ఉన్న మహేష్ న్యూయార్క్ లో ఒక థియేటర్లో కుటుంబ సమేతంగా.. అల్లు అర్జున్ నటించిన “అలా.. వైకుంఠపురములో..” చిత్రాన్ని చూశాడట. ఈ విషయాన్నీ చాలా సీక్రెట్ గా ఉంచారట. అయితే ఈ సినిమా గురించి మహేష్ ఎం చెబుతాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here