Pawan Kalyan: తెలంగాణ రాజకీయాలపై పవన్ కామెంట్స్.. ఇక్కడ కూడా బీజేపీతో పొత్తు అంటూ?

Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయనకు భక్తి భావం ఎక్కువ అనే సంగతి మనకు తెలుసు. ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లి స్వామి వారి ఆశీస్సులు తీసుకొని తన పనులను ప్రారంభిస్తూ ఉంటారు..

ఈ క్రమంలోనే ఈయన రాజకీయాలలో సంచలన విజయం అందుకోవడమే కాకుండా ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి ఉపముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చారు. ఈ ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక పవన్ కళ్యాణ్ వస్తున్నారనే విషయం తెలియడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రత చర్యలను చేపట్టారు.

ఇక స్వామివారి దర్శనం పూజా కార్యక్రమాల అనంతరం పవన్ కళ్యాణ్ తెలంగాణలో తన పార్టీ ఏర్పాటుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై జనసేన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ మాట్లాడుతూ..తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయని పవన్ పేర్కొన్నారు. జై జనసేన జై బీజేపీ జై తెలంగాణ అంటూ పవన్ కల్యాణ్ నినాదాలు చేయడం గమనార్హం.

బీజేపీతో పొత్తు..
కొండగట్టు పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత తెలంగాణ జనసేన పార్టీ నేతలతో పవన్ భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుంది. ఇటీవల ఎంపీ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అక్కడ కూడా బిజెపి జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.