లవ్ బ్రేకప్ అయితే అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువ బాధ పడతారట తెలుసా?

సాధారణంగా ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ చిగురించడం సర్వసాధారణమే. ప్రేమ పుట్టడానికి కారణం ఉండకపోవచ్చు కానీ ఆ ప్రేమ విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇలా ఎంతో మంది జంటలు ప్రేమలో పడి చివరికి బ్రేకప్ చెప్పుకునే సందర్భాలు కూడా అధికంగా ఉంటాయి. ఇలా లవ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల అబ్బాయిలు మరొక అమ్మాయితో ప్రేమలో పడతారని వారు తొందరగా ఈ బాధను మర్చిపోతారని చాలా మంది భావిస్తుంటారు.

నిజానికి లవ్ బ్రేకప్ అయితే అమ్మాయిలు కన్నా ఎక్కువగా అబ్బాయిల బాధపడతారని తాజా అధ్యయనాల్లో నిరూపితమైంది. లాంకెస్టర్ యూనివర్సిటీలోని పరిశోధకులు, మనస్తత్వ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఈ పరిశోధనను నిర్వహించింది. ఈ పరిశోధనలో భాగంగా ఎక్కువమంది లవ్ బ్రేకప్ అయిన మగవారిలో పరిశోధనలు జరిగాయి.

ఈ పరిశోధనలో భాగంగా లవ్ బ్రేకప్ అయిన తర్వాత అమ్మాయిలు తొందరగా ఆ విషయాన్ని మరిచి పోయి వేరొకరితో జీవితం పంచుకుంటారని, కానీ అబ్బాయిలు అదే విషయం గురించి బాధపడుతూ ఎన్నో మానసిక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని ఈ పరిశోధన ద్వారా వెల్లడైంది. మరికొంతమందిలో ప్రేమంటేనే విసుగుపుట్టి స్థాయిలోకి మగవారు చేరుకున్నారని నిపుణులు వెల్లడించారు.

ఇలా లవ్ లో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదిరించి తమ ప్రేమలో గెలవాలని అబ్బాయిలు భావించి నిజాయితీగా ప్రేమించడం వల్లే ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఈ సందర్భంగా నిపుణులు వెల్లడించారు.