ప్రస్తుత కాలంలో భార్య భర్తల మధ్య ఏ చిన్నపాటి మనస్పర్థలు వచ్చినా అవి ఎన్నో సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే తొందరపాటు నిర్ణయం వల్ల ఎందరో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుని చివరికి బిడ్డను ఒంటరి పాలు చేసిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…
హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా గత కొంత కాలం నుంచి మురళీధర్ రెడ్డి, మౌనిక అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి 11 సంవత్సరాల క్రితం వివాహం జరగగా తొమ్మిది సంవత్సరాల బాబు ఉన్నాడు. గత 11 సంవత్సరాల నుంచి వీరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నారు.
అయితే గత కొద్దిరోజుల నుంచి భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయంలోనూ మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఇలా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో ఆవేశంలో మౌనిక వంటగదిలో కూరగాయలు కట్ చేసే కత్తితో తన భర్తపై విచక్షణారహితంగా దాడి చేసింది.
ఈ క్రమంలోని తన భర్త పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించిన మౌనిక తిరిగి పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయం చెప్పి ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని తనని అరెస్ట్ చేశారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…