Director Bobby: చిరంజీవి రాజకీయాలకు పనికిరారు… అందుకు పవన్ మాత్రమే సరైనోడు… డైరెక్టర్ బాబీ కామెంట్స్ వైరల్!

Director Bobby: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా మంచు గుర్తింపు పొందిన డైరెక్టర్ బాబి తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వైజాగ్ లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ బాబి చిరంజీవి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ చిరంజీవి అన్నయ్యకు రాజకీయాలు ఏమాత్రం పనికిరావని తెలిపారు. ఆయనకు దేవుడు ఒక తమ్ముడినీచ్చాడు. రాజకీయాలకు పవన్ సరైనోడనీ బాబి తెలిపారు.

చిరంజీవి గారు రాజకీయాలలో ఉండి ఎవరిని కూడా ఎదిరించి మాట్లాడలేరు కానీ చిరంజీవి గారిలో ఉన్న మంచితనం ఆవేశం కలిస్తే పవన్ కళ్యాణ్ ఆయన ఎవరికైనా ఎలాంటి సమాధానమైనా చెప్పగలరు. మాటకు మాట కత్తికి కత్తి అన్నట్లుగా ఉంటారని బాబి తెలిపారు.అయితే ఒకరోజు తాను మీరెందుకు రాజకీయాలలో ఇతరులను ఎదిరించలేరు అని అడిగినప్పుడు వాళ్లకు కూడా అమ్మ నాన్నలు అక్కచెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్లు బాధపడతారని ఎంతో సౌమ్యంగా అన్నయ్య ఒకరోజు నాతో చెప్పారని బాబి గుర్తు చేసుకున్నారు.

Director Bobby: రవితేజ అవకాశం ఇవ్వడం వల్లే ఈ స్థాయిలో ఉన్నా….

ఇక చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలో తన ప్రస్థానం మొదలైంది. ఇండస్ట్రీలోకి వచ్చిన 20 సంవత్సరాలకు ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టమని తెలిపారు. ఇక నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు గల కారణం రవితేజ.ఆయన నన్ను నమ్మి సినిమా ఇవ్వడం వల్లే డైరెక్టర్ గా నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని ఈ సందర్భంగా బాబీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.