కోటా శ్రీనివాసరావుకి వార్నింగ్ ఇచ్చి.. తాగి గొడవ చేస్తే ఎమ్మెస్ నారాయణను లాగిపెట్టి కొట్టాను: దర్శకుడు సాగర్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చార్మినార్, అన్వేషణ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో డైరెక్టర్ సాగర్ ఒకరు. ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వ బాధ్యతలను స్వీకరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు హలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే ఒక సినిమా షూటింగ్ జరిగే సమయంలో దర్శకుడికి కోట శ్రీనివాసరావుకు మధ్య మనస్పర్థలు తలెత్తాయటగా ఎందుకు అనే ప్రశ్న ఎదురవడంతో అందుకు దర్శకుడు సమాధానం చెబుతూ.. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించడం కోసం భరణి, మహేష్ ఆనంద్, కోట ముగ్గురిపై ఆ సన్నివేశం చిత్రీకరించాల్సి ఉంది. ఇక వీరి ఇచ్చిన తేదీ ప్రకారం సెట్లో అందరూ సిద్ధంగా ఉన్నారు.

కానీ కోట శ్రీనివాసరావు ఆ రోజు షూటింగ్ కి రాలేనని తనకు బాగా కావాల్సిన వాళ్ళు మరణించారని చెప్పడంతో ఆ రోజు షూటింగ్ వాయిదా వేసుకున్నాను అదేవిధంగా తనకు ఎప్పుడు కుదురుతుందో కనుక్కొని అదే తేదీన షూటింగ్ ఖరారు చేసాము. అయితే ఆరోజు కూడా కోట షూటింగుకు రాకపోవడంతో ఏంటిదని ఫోన్ చేయగా నేనురాలేనని సమాధానం చెప్పాడు. కోట ఆ మాట అనడంతో ఎంతో కోపం వచ్చిందని నువ్వు చెప్పిన తేదీకి షూటింగ్ ప్లాన్ చేసిన రాకపోవడం ఏంటి నాలో ఉన్న మరొక యాంగిల్ ను చూడకు వచ్చి సెటిల్ చేయండి అని చెప్పడంతో ఆ తర్వాత కోట రావడం ఆ సినిమా షూటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇలా ఇద్దరికీ అభిప్రాయభేదాలు వచ్చాయని తెలిపారు.

అదేవిధంగా ఒక సినిమా షూటింగ్ సమయంలో ఎమ్.ఎస్.నారాయణ పై చేయి కూడా చేసుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా డైరెక్టర్ సాగర్ తెలియజేశారు. అందరూ కూర్చుని మాట్లాడుతున్న సమయంలో ఎం.ఎస్.నారాయణ తాగి నిర్మాతలను బూతులు తిట్టడంతో లాగి చెంపపై ఒకటి కొట్టానని అలా ఎందుకు మాట్లాడావ్.. మాట్లాడటం తప్పు కదా.. అంటూ ఎమ్మెస్ నారాయణ పై చేయి చేసుకున్న విషయాన్ని కూడా ఇంటర్వ్యూ సందర్భంగా దర్శకుడు తెలియజేశారు.