ప్రపంచంలో అతి చల్లని గ్రామం ఎక్కడుందో మీకు తెలుసా..?

చలి కాలం వచ్చిందంటే చాలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా గజగజా వణకాల్సిందే. సౌత్ ఇండియాతో పోలిస్తే నార్త్ ఇండియాలో ఎక్కువగా మంచు కురవడంతో పాటు విపరీతమైన చలి ఉంటుంది. భారత వాతావరణ శాఖ సైతం శీతాకాలం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తోంది. అయితే 20 డిగ్రీల ఉష్ణోగ్రతకే మనం చలికి గజగజా వణికిపోతాం.

ఒకవేళ ఆ ఉష్ణోగ్రత -71 డిగ్రీలుగా ఉంటే ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. అయితే అలాంటి వాతావరణం ఉన్న గ్రామం ఉండటంతో పాటు ఆ గ్రామంలో 800 మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. రష్యా దేశంలోని సైబీరియాకు దగ్గరలో ఒమ్యకోన్ అనే గ్రామం ప్రపంచంలోనే అతి శీతల గ్రామంగా పేరు తెచ్చుకుంది. 1924 సంవత్సరంలో ఇక్కడ -71.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

ఈ గ్రామంలో మంచు లేదా మంచుతుఫాను నిరంతరం పడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో నవంబర్ నెల నుంచి వచ్చే జనవరి వరకు అతి శీతల పరిస్థితులు ఉంటాయి. చలికాలంలో ఇక్కడ సూర్యుడు 10 గంటల సమయంలో ఉదయిస్తాడంటే ఈ గ్రామంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో సులభంగానే అర్థమవుతుంది. ఈ గ్రామంలో రైతులు పంటలు కూడా పండించలేరు.

రిన్డీర్, హార్స్ మాస్, మాంసం చేపలను తిని ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తారు. 50 డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు తగ్గితే ఈ గ్రామంలో పాఠశాలలు మూసివేశారు. ప్రపంచంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఈ గ్రామం గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.